Rajamouli: ఆ స్టార్ డైరెక్టర్ ను బీట్ చేయాలని ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయిన రాజమౌళి…

ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లందరు తమదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే...ఇక ఇండస్ట్రీ లో ఎవరైనా సరే సక్సెస్ ను మాత్రమే కొలమానం గా చూస్తూ ఉంటారు...

Written By: Gopi, Updated On : September 18, 2024 5:36 pm

Rajamouli

Follow us on

Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా తనదైన రీతిలో సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం రాజమౌళి ఇండియా లో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే రాజమౌళితో పాటు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేసిన ఒకప్పటి స్టార్ డైరెక్టర్ రాజమౌళిని బీట్ చేసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఈయన ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి , ఛత్రపతి, విక్రమార్కుడు లాంటి వరుస సినిమాలను చేసుకుంటూ సూపర్ సక్సెస్ లను అందుకుంటూ వచ్చాడు. కానీ ఆయనకు మాత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయితే దక్కలేదు. కానీ పోకిరి సినిమాతో మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్టు కొట్టి నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగాడు. నిజానికి రాజమౌళి పూరి జగన్నాథ్ ఇద్దరి కెరియర్ ఒకేసారి స్టార్ట్ చేసినప్పటికీ మొదట్లో రాజమౌళిని బీట్ చేస్తూ పూరి జగన్నాథ్ టాప్ డైరెక్టర్ గా ఎదగడం అనేది అప్పట్లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి పూరి జగన్నాథ్ రాసుకున్న స్క్రిప్టులు గాని ఆయన చేసే సినిమాలు గానీ ప్రేక్షకులను విపరీతంగా అలరించేవి.

అందువల్లే ఆయన స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక యూత్ ని బేస్ చేసుకొని ఆయన రాసిన డైలాగులు కూడా అద్భుతంగా ఉండేవి. ఇక రాజమౌళికి మాత్రం రామ్ చరణ్ తో చేసిన మగధీర సినిమా వచ్చేంత వరకు ఒక ఇండస్ట్రీ హిట్టు కూడా దక్కలేదు. బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి గానీ, ఇండస్ట్రీ హిట్లు మాత్రం కొట్టలేకపోయాడు.

తద్వారా ఆయన పూరి జగన్నాథ్ కంటే వెనుకబడిపోయాడనే చెప్పాలి. ఇక ఎప్పుడైతే మగధీర వచ్చిందో అప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్లను బీట్ చేస్తూ ఆయన ఒక్కసారిగా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకొని నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగులో ఆయన నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం ఆయన్ని బీట్ చేసే దర్శకుడు మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే తనదైన రీతిలో సినిమాలు చేయడానికి రాజమౌళి ముందుకు వస్తున్నప్పటికి మహేష్ బాబు తో చేయబోయే పాన్ వరల్డ్ సినిమా మీదనే ఎప్పుడు ఆయన పూర్తి ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…