
కరోనా సెకండ్ వేవ్ ఈ స్థాయిలో వస్తోందని ఊహించని జనం, ప్రస్తుతం భయానక వాతావరణంతో వణికిపోతున్నారు. ఈ మహమ్మారి బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతూ ఉంది. కానీ, రాజకీయ నాయకులు మాత్రం చక్కగా ఏసీలో కూర్చుని ఫోన్ నుండే వీడియో కాల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ కరోనా కంట్రోల్ లోనే ఉంది అంటూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.
మరోపక్క కరోనా కారణంగా తమ ఆత్మీయుల్ని దూరం చేసుకుని తల్లడిల్లిపోతూ అల్లాడిపోతోన్న జనం ఏడుపులను వినే నాధుడే లేడు. వైరస్ వేగంగా ఉంది, దయచేసి ఎవరికి వారు జాగ్రత్తలు పాటిస్తూ ఈ మహమ్మారి నుండి మనల్ని మనమే కాపాడుకుందాం అంటూ సినీ ప్రముఖులు ఎమోషనల్ అయి ప్రజలను మోటివేట్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా కరోనా నివారణ చర్యల పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
ఇంతకీ మెగాస్టార్ ఆ వీడియోలో ఏమి చెప్పారంటే.. ఆయన మాటల్లోనే..‘‘నమస్కారం, కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. చాలా మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ వైరస్ నుండి కోలుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. మనలో కొంతమందిని ఈ వైరస్ వల్ల కోల్పోతున్నాం, నిజంగా గుండె తరుక్కుపోతోంది. అందుకే ఈ తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ లాక్‌డౌన్ పెట్టారు. కనీసం ఇప్పుడైనా అలక్ష్యం చేయకుండా కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా మనం పాటించాలి.
ఇంటి నుంచి బయటికి రాకండి. ఒకవేళ లాక్‌డౌన్ సడలించిన వేళల్లో బయటికి వచ్చినా..మాస్కులు ధరించండి. వీలైతే డబుల్ మాస్కులు ధరించండి. లాక్ డౌన్‌లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎప్పుడు వీలైతే అప్పుడు వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సినేషన్ తర్వాత కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఒంట్లో ఏ మాత్రం నలతగా ఉన్నా.. వెంటనే డాక్టర్స్ ని సంప్రదించండి. కరోనా నుంచి కోలుకున్న నెలరోజుల తర్వాత మీలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి కాబట్టి, అప్పుడు మీరు ప్లాస్మా డొనేట్ చేయండి. అప్పుడు మీరు ఇద్దరిని కాపాడినవారవుతారు. ఈ విపత్తు సమయంలో సమాజానికి మీ వంతు సాయం చేయండి ప్లీజ్. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ఈ కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ.. మన దేశాన్ని రక్షించుకుందాం. ప్లీజ్ అన్ని జాగ్రత్తలు తీసుకోండి.. సేఫ్ గా ఉండండి’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు.
#Covid19IndiaHelp #StayHomeStaySafe #WearMask 😷 #DontPanic #GetVaccinated #DonatePlasmaSaveLives 🙏🙏
Lets #DefeatCorona 👊 pic.twitter.com/g1ysqxmPJR— Chiranjeevi Konidela (@KChiruTweets) May 14, 2021