Anil Ravipudi message to parents: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి…పటాస్ సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇక రీసెంట్ గా చిరంజీవితో చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతోంది…ఇక మన శంకర్ వరప్రసాద్ సినిమాలో ఆయన కామెడీ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ను సైతం బ్యాలెన్స్డ్ గా చూపించాడు. కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా అనిల్ రావిపూడి మాట్లాడుతూ మన శంకర్ వరప్రసాద్ సినిమాలోని ‘మందు మహదానందం’ అంటూ వచ్చే డైలాగుల మీద సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ చేస్తున్నారు. అవి చాలా కామెడీగా ఉన్నాయి బాగున్నాయి అంటూ ఆయన చెప్పాడు. కానీ ఈ మందు ప్రస్తావన పిల్లల దగ్గర తీసుకురావద్దని పిల్లల చేత ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి రీల్స్ చేయించకూడదంటూ ఆయన ప్రతి ఒక్క పేరెంట్ కి చాలా రెస్పెక్ట్ గా చెప్పాడు. దానివల్ల పిల్లల మీద నెగెటివ్ ఇంప్రెషన్ పడే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశ్యంతోనే ఆయన అలా చెప్పడంటు మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా సినిమాలో చూపించిన మంచిని మాత్రమే తీసుకోవాలని కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలను చూసి చూడనట్టుగా వదిలేయాలి అంటూ మరికొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…
ఇక ప్రస్తుతం ఇండియాలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా పేర్లు గాంచిన వారిలో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి పేరు వినబడుతుంది. అంతటి గొప్ప గుర్తింపును సాధిస్తున్న ఆయన 2027 సంక్రాంతి కానుకగా మరో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం వెంకటేష్ తో ‘సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం’ అంటూ ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే అనిల్ రావిపూడి ఈ విషయం మీద క్లారిటి ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది…