Ram Pothineni : ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’..గత ఏడాది మార్చి నెల నుండే ఆంధ్ర ప్రదేశ్ మారుమ్రోగిపోతున్న టైటిల్ ఇది. జనసేన పార్టీ అధినేత, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తాను పిఠాపురం(Pithapuram) నుండి పోటీ చేయబోతున్నా అని అధికారిక ప్రకటన చేసిన రోజు నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ టైటిల్ మారుమోగిపోయింది. అభిమానులు తమ బైక్స్ వెనుక, ఆటోల వెనుక ఈ టైటిల్ ని స్టికర్ గా వేయించుకొని తిరిగారు. ఎన్నికల ముందు నుండే ఈ ట్రెండ్ మొదలు పెట్టారంటే, వాళ్లకు తమ నాయకుడు కచ్చితంగా గెలుస్తాడనే నమ్మకం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వాళ్ళు అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతం నుండి 70 వేల మెజారిటీ తో గెలవడమే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నిల్చి 5 శాఖలకు మంత్రి బాధ్యతలను కూడా చేపడుతున్నాడు.
Also Read : హీరో రామ్ తో జనసేన మంత్రి కందుల దుర్గేష్ భేటీ..కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఇదంతా పక్కన పెడితే ఈ టైటిల్ బాగా పాపులర్ అవ్వడం తో ప్రముఖ యంగ్ హీరో రామ్ పోతినేని(Energetic Star Ram Pothineni) తన కొత్త సినిమాకి టైటిల్ గా పెట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన పి.మహేష్ బాబు(P.Mahesh Babu) దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక వీరాభిమాని తన అభిమాన హీరోని కలుసుకునే క్రమంలో దారి మధ్యన జరిగే ప్రయాణం ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. రామ్ ఈ సినిమాలో చాలా యంగ్ లుక్ లో కనిపించడం ఇది వరకు విడుదలైన పోస్టర్స్ లో మనమంతా చూసాము. అయితే ఈ సినిమాకి ‘ఆంద్ర కింగ్ గారి తాలూకా’ అని టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ టైటిల్ ని ఆదర్శంగా తీసుకొనే ఈ సినిమాకి ఇలాంటి టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. దీని పై సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాము తమ అభిమాన హీరో కోసం క్రియేట్ చేసిన టైటిల్ ని గుర్తించి, ఏకంగా రామ్ లాంటి యంగ్ హీరో తన సినిమాకి అలాంటి టైటిల్ ని పెట్టుకోవడం ఆనందంగా ఉందని అంటున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ భోర్సే నటిస్తుంది. ఆమెకు సంబంధించిన లుక్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న రామ్ పోతినేని ఈ సినిమా తో భారీ కం బ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు. డైరెక్టర్ మహేష్ బాబు గత చిత్రం ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ సూపర్ హిట్ అయ్యింది కాబట్టి ఈ సినిమాని కూడా అద్భుతంగా తీసి ఉంటాడనే నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్. మరి రామ్ కి కావాల్సిన భారీ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలుస్తుందో లేదో చూడాలి.
Also Read : యంగ్ హీరోయిన్ తో రామ్ పోతినేని డేటింగ్..అడ్డంగా దొరికిపోయాడుగా..2 నెలల సమయంలోనే ఒక్కటైపోయారా!