Divvala Madhuri Pickles Ramya: ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) ఎట్టకేలకు నిన్నటితో ముగిసింది. అన్ని బిగ్ బాస్ సీజన్స్ కంటే ఈ సీజన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని , టీఆర్ఫీ రేటింగ్స్ లో సీజన్ 4 తర్వాత ఈ సీజన్ కి ఎక్కువ వచ్చాయని అంటున్నారు. అయ్యో ప్రతీ రోజు రాత్రి బిగ్ బాస్ చూడడం అలవాటు, ఇక రేపటి నుండి ఏమి చూడాలి అంటూ ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ఆడియన్స్ పై ఈ సీజన్ అంత గొప్ప ప్రభావం చూపించింది. ఈ సీజన్ కి కచ్చితంగా టైటిల్ విన్నర్ అవుతుందని అనుకున్న తనూజ, చివరికి రన్నర్ గా మిగలగా, ఆర్మీ పవన్ కళ్యాణ్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. ఇక డిమోన్ పవన్ టాప్ 3 స్థానం లో నిల్చొని 15 లక్షల రూపాయిల సూట్ కేసు తో బయటకు వచ్చాడు. ఈ విషయం లో ప్రేక్షకులు చాలా సంతోషించారు.
కానీ మొదటి ఎపిసోడ్ నుండి చివరి ఎపిసోడ్ వరకు ఆడియన్స్ కి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందించి, ఆల్ రౌండర్ గా నిల్చిన ఇమ్మానుయేల్ మాత్రం టాప్ 4 స్థానం లో నిలిచాడు. ఇది మాత్రం ప్రేక్షకులకు జీర్ణించుకోలేని విషయం గా మారింది. ఇదంతా పక్కన పడితే ప్రతీ సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి పాత కంటెస్టెంట్స్ అందరూ హాజరయ్యారు. వారిలో దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య కూడా వచ్చారు. ఫైర్ స్ట్రోమ్స్ పేరుతో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఫైర్ బ్రాండ్స్ లాగా అడుగుపెట్టిన ఈ ఇద్దరు కంటెస్టెంట్స్ ఏ రేంజ్ లో చెలరేగిపోయారో మనమంతా చూసాము. వామ్మో, వీళ్లేంటి ఈ రేంజ్ లో ఉన్నారు, ఇలా మాట్లాడుతున్నారేంటి అని కూడా అనుకున్నారు. వీళ్లిద్దరి మధ్య గొడవలు జరుగుతాయేమో అని అంతా అనుకున్నారు.
కానీ హౌస్ లోకి వచ్చిన తర్వాత వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇది కాసేపు పక్కన పెడితే నిన్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి వచ్చే ముందు రమ్య మరియు ఆమె సోదరి కలిసి దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ జంట ని కలిశారు. దువ్వాడ శ్రీనివాస్ రమ్య గురించి మాట్లాడుతూ ‘నువ్వు మొదటి వారం లోనే ఎలిమినేట్ అవ్వడం నాకు చాలా బాధ కలిగించింది. అలాంటి కంటెస్టెంట్ కాదు నువ్వు. ఎవరెవరో హౌస్ లో చివరి వరకు ఉన్నారు. వాళ్ళ బదులు నువ్వు ఉండాల్సింది. కనీసం టాప్ 5 రేంజ్ లో లేకపోయినా, 10 వారాలు అయినా హౌస్ లో ఉండాల్సిన కంటెస్టెంట్ నువ్వు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.