Ram Charan Daughter Photos
Ram Charan Daughter Photos: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన జీవితాల్లోకి బుడి బుడి అడుగులు వేసుకుంటూ ఒక చిన్న పాప అడుగుపెట్టిన సందర్భంగా మెగా ఫ్యామిలీ కుటుంబీకులు మరియు అభిమానులు సంబరాలు చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు తెల్లవారు జామున 1 గంట కి ఆ బిడ్డ జన్మించింది. నిన్న రాత్రే ఉపాసన హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యింది. ప్రపంచం లో ఉన్న ప్రముఖ గైనకాలజిస్ట్స్ అందరి సమక్షం లో ఉపాసన ప్రసవించింది.
రామ్ చరణ్ ఉపాసన తల్లి తండ్రులు అయిన సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోలు మరియు సెలెబ్రిటీలు శుభాకాంక్షల వెల్లువ కురిపించారు. ఎక్కడ చూసినా దీని గురించే ప్రస్తుతం మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక పుట్టిన ఆడబిడ్డని అభిమానులకు చూపిస్తారో లేదో అని అనుకుంటున్న సమయం లో హాస్పిటల్ నుండి ఉపాసన మరియు రామ్ చరణ్ కూతురు కి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి.
ఈ ఫోటోని చూసిన అభిమానులందరూ చిరంజీవి మరియు రామ్ చరణ్ పోలికలను మిక్స్ చేసి పుట్టినట్టుగా అనిపించింది అని అంటున్నారు. పెరిగి పెద్దయ్యాక ఇంకా బాగా పోలికలు తెలుస్తాయని అంటున్నారు.ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్స్ లోనే ఉంది, ఈరోజు మొత్తం అబ్సెర్వేషన్ లోనే పెట్టి, రేపు ఉదయం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ కి సంబంధించిన వాళ్లంతా వచ్చి చిన్న పాప ని చూసి పోగా, పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు.
ఆయన ప్రస్తుతం ‘వారాహి విజయయాత్ర’ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు, కాకినాడ ప్రాంతం లో వివిధ వర్గాలకు చెందిన వారిని కలుస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. అందుకే చూసేందుకు రాలేకపోయాడని, కానీ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసాడని అంటున్నారు. అభిమానులు కనీసం ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తే బాగుండును అని అనుకుంటున్నారు, మరి పవన్ కళ్యాణ్ ట్వీట్ వేస్తాడో లేదో చూడాలి.