Photo Talk: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ త్రోబ్యాక్ ఫొటోలో ఉన్న పాప ఇప్పటి స్టార్ లేడీ. దాదాపు 15 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్ ని ఏలుతోంది. అనేక సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చింది. రెండు తరాల సూపర్ స్టార్స్ ని కవర్ చేసిన ఘనత ఈమె సొంతం. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. అవును మీ ఊహ కరెక్టే, అమాయకంగా కనిపిస్తున్న ఈ బుజ్జి పాప ఎవరో కాదు చందమామ కాజల్. కాజల్ ఐదేళ్ల ప్రాయంలో ఉన్నప్పటి ఫోటో ఇది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాజల్ వెండితెరపై క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. హీరోయిన్ చెల్లి పాత్రతో మొదలైన ఆమె ప్రయాణం స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరింది.

2004లో విడుదలైన బాలీవుడ్ మూవీ క్యూ హో గయానా చిత్రంలో హీరోయిన్ ఐశ్వర్య రాయ్ చెల్లిగా కాజల్ నటించారు. హీరోయిన్ గా ఆమె ప్రస్థానం మొదలైంది తెలుగులోనే. దర్శకుడు తేజా కళ్యాణ్ రామ్ హీరోగా ‘లక్ష్మీ కళ్యాణం’ మూవీ తెరకెక్కించారు. ఆ చిత్ర హీరోయిన్ గా కాజల్ ఎంపికైంది. అప్పటికి తనకు నటన పెద్దగా రాదు. నిజ జీవితంలో ఎన్నడూ గట్టిగా ఏడ్చిన అనుభవం లేని కాజల్ కి లక్ష్మీ కళ్యాణం మూవీలో ఏడ్చే సన్నివేశాల్లో నటించడం చాలా కష్టమైపోయిందట.
లక్ష్మీ కళ్యాణం డిజాస్టర్ కావడంతో కాజల్ నిరాశ చెందారు. అయితే అదే సమయంలో కృష్ణ వంశీ దర్శకత్వంలో చందమామ మూవీలో కాజల్ చేస్తున్నారు. చందమామతో కాజల్ ఫస్ట్ హిట్ అందుకున్నారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి ప్రేక్షకులు హిట్ అందించారు. ఇక కాజల్ కెరీర్ మలుపు తిప్పిన చిత్రం మాత్రం మగధీర. చందమామ అనంతరం కాజల్ చేసిన పౌరుడు, ఆటాడిస్తా ఫ్లాప్ అయ్యాయి. కెరీర్ కష్టం అనుకుంటున్న తరుణంలో రాజమౌళి కాజల్ కి పిలిచి మరీ భారీ ఆఫర్ ఇచ్చాడు.

2009లో విడుదలైన మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టి చరిత్ర తిరగరాసింది. మిత్రవింద గా కాజల్ గ్లామర్ కి యూత్ పడిపోయారు. కాజల్ యూత్ కలల రాణి ఐపోయారు. అక్కడ నుండి కాజల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి చిత్రాలు ఇమేజ్ మరింత ముందుకు తీసుకెళ్లాయి. ఐదారేళ్ళు ఇండస్ట్రీలో ఉండటమే కష్టంగా ఉన్న రోజుల్లో కాజల్ దశాబ్దాన్నర కాలంగా టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. 2020 లో పెళ్లి చేసుకున్న కాజల్ ఒక అబ్బాయికి జన్మానిచ్చారు.