Photo Story: ఈ ఫొటోలో బట్ట తల వేసుకొని, నిద్ర మొహంతో అవార్డుని అందుకుంటున్న ఈ వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా ?. ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్ అధినేత కుమారుడు, ఒక ప్రముఖ డైరెక్టర్ కూడా ఈయనకు అండగా ఉంటాడు, రీసెంట్ సమయం లో ఇతను నిర్మించిన ప్రతీ సినిమా బంపర్ హిట్. ఇతని మొదటి సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ ఆ తర్వాత నుండి ఇతను బౌన్స్ బ్యాక్ అయ్యి, తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆణిముత్యాలు లాంటి సినిమాలను అందిస్తూ, కరోనా లాక్ డౌన్ తర్వాత అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతే కాదు సోషల్ మీడియాలో అందరూ ఇతనికి యాటిట్యూడ్ బీభత్సంగా ఉంటుందని అంటుంటారు, ఈయన మైక్ పట్టుకున్నదంటే వివాదమే, ముక్కుసూటి తనం తో కుండబద్దలు కొట్టేవిధంగా మాట్లాడడం ఇతని నైజం. అతను మరెవరో కాదు, సూర్యదేవర నాగవంశీ(Nagavamsi).
Also Read: రచ్చ రంబోలా.. నాని ప్యారడైజ్ తో ఏదో చేసేలా ఉన్నాడే..!
నాగవంశీ ఏంటి, ఇలా ఉన్నాడు, అసలు గుర్తుపట్టలేక ఉన్నాం కదా, పైన బట్ట ఏంటి?, అంటే ఇప్పుడు మనకి నాగవంశీ విగ్గు తో కనిపిస్తున్నాడా?, లేదా మధ్యలో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాడా?, అసలు ఏంటి కథ? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే వరుస సూపర్ హిట్స్ తో ముందుకు దూసుకుపోతున్న నాగవంశీ స్పీడ్ కి రీసెంట్ గా విడుదలైన ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం పెద్ద బ్రేక్ వేసింది అనే విషయం అందరికీ తెలిసిందే. మొదట్లో కాస్త పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి కానీ, ఆ తర్వాత టాక్ మారిపోయింది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు సెకండ్ హాఫ్ పై అత్యంత దారుణమైన కామెంట్స్ చేశారు. ఫలితంగా ఈ సినిమా వారం రోజులు కూడా థియేటర్స్ లో నిలబడలేకపోయింది. కమర్షియల్ గా నాగవంశీ కి నష్టాలను తెచ్చిపెట్టింది.
అయితే ఇప్పుడు ఆయన ‘వార్ 2’ (War 2 Movie) మూవీ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో మన ముందుకు ఈ చిత్రం రాబోతుంది. మరి ఫ్లాపుల నుండి వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యే అలవాటు ఉన్న నాగవంశీ ఈ చిత్రం తో హిట్టు అందుకొని మరోసారి ఫామ్ లోకి వస్తాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ రాకపోతే మాత్రం నాగవంశీ కి గట్టి దెబ్బ పడేలానే ఉంది. ప్రస్తుతం ఉన్న నిర్మాతల్లో ఆయనే టాప్. త్వరలోనే ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ మైథలాజికల్ సినిమా తీయబోతున్నాడు. ఈ గ్యాప్ లో ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తగిలితే పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి.