Perni Nani and Producers: గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వంతో సినీ పెద్దలు మధ్య జరుగుతున్న చర్చలలో భాగంగా ఈ రోజు కూడా కొత్త చర్చ ముగిసింది. మచీలిపట్నంలో మంత్రి పేర్ని నానితో తెలుగు సినిమా నిర్మాతల భేటీ ముగిసింది. ఇక భేటీ ముగిసిన వెంటనే.. మంత్రి పేర్ని నాని మీడియాతో ముచ్చటించారు.

పేర్ని నాని మాటల్లో.. ‘ఈ ఆన్ లైన్ టికెటింగ్ అనేది మేమేదో కొత్తగా పెట్టింది కాదు. ప్రభుత్వం కంటే కూడా సినీ పరిశ్రమే ఆన్ లైన్ టికెటింగ్ కు బాగా అనుకూలంగా ఉంది. సహజంగా సినిమా టికెట్ల పై ఒక నిర్దిష్ట విధానం అనేది ఉండాలి. అది చాలా అవసరం కూడా.
అందుకే.. ఆన్ లైన్ టికెటింగ్ విధానం కొనసాగుతుంది. కాబట్టి.. కొంతమంది ఆరోపణలు చేస్తున్నట్లు.. ఇది మా ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టింది కాదు’ అంటూ మంత్రి స్పష్టం చేశాడు. ఇక సినిమా పెద్దలు ఇండస్ట్రీలో తమ సమస్యలను కూడా వివరంగా వివరించారు.
వారి అభ్యర్ధనల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది, టికెట్ రేటు గురించే. టికెట్ రేటు తక్కువగా ఉంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది అని చెప్పారు. నిజానికి ప్రోడక్షన్ కాస్ట్ కూడా పెరిగింది. నిజమే.. అందుకే టికెట్ రేటు పై ప్రభుత్వం చొరవ చూపాల్సిందిగా నిర్మాతల రిక్వెస్ట్ చేశారు.
అలాగే కరోనా కారణంగా సినిమా పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని, పైగా థియేటర్లో ఉన్న 50 శాతం ఆక్యూపెన్సీని 100 శాతం పెంచాలని కూడా నిర్మాతలు కోరారు’ అని పేర్ని నాని చెప్పుకొచ్చారు. కానీ ఏ విషయం పై స్పష్తమైన హామీ లేకపోవడంతో సినీ పెద్దలు డీలా పడ్డారు. ఈ మీటింగ్ లో నిర్మాత దిల్ రాజు, బన్ని వాసు, సునీల్ నారంగ్, వంశీ రెడ్డి, మైత్రీ నవీన్ తదితరులు పాల్గొన్నారు.