Mahesh Babu Hero Debut: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా అవతరించాడు. ముఖ్యంగా మహేష్ బాబుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నప్పుడు కృష్ణ చాలామంది దర్శకులను సంప్రదించారట. అందులో కొంతమంది దర్శకులు మహేష్ బాబు తో సినిమా చేయడానికి ఇష్టపడలేదు. మరికొందరైతే మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీకి పనికిరాడేమో అనేట్టుగా మాట్లాడారట. మొత్తానికైతే రాఘవేందర్రావు దర్శకత్వంలో రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాడు. ఇంతకీ మహేష్ బాబును హీరోగా పనికిరాడు అని చెప్పిన డైరెక్టర్ ఎవరు అంటూ కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. నిజానికి తమిళ్ సినిమా దర్శకుడు అయిన పి వాసు మహేష్ బాబును చూసి తను హీరోగా పెద్దగా పనికి వచ్చేలా కనిపించడం లేదు అని అన్నారట.
కానీ కసరత్తులు చేస్తే మాత్రం స్టార్ హీరో అయ్యే అవకాశాలైతే ఉన్నాయనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే తను చెప్పిన మాటలను సీరియస్ గా తీసుకున్న మహేష్ బాబు చాలా వరకు కసరత్తులు చేసి యాక్టింగ్ లో మెలుకువలను కూడా నేర్చుకొని స్టార్ హీరోగా మారాడు…
ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు ఉండటం అనేది నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. నిజానికి కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మహేష్ బాబు చాలా అద్భుతంగా నటిస్తాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో తనలా నటించేవారు ఇండస్ట్రీలో మరెవరు లేరు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక అలాంటి మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మహేష్ బాబు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోగా మారిపోతాడు…ఇక ఈ మూవీ తర్వాత ఆయన డైరెక్ట్ గా హాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమా చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు…
