https://oktelugu.com/

Pooja Hegde: అన్నీ కనిపించేలా అలాంటి డ్రెస్ లో పూజ హెగ్డే… జనాల దారుణమైన ట్రోల్స్

ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ కి పూజ హెగ్డే పింక్ కలర్ ట్రెండీ వేర్లో హాజరయ్యారు. కురచైన టాప్ తో సదరు డ్రెస్ కొంచెం వల్గర్ గా ఉంది. దీంతో నెటిజెన్స్ ఆమెపై విమర్శలు సంధించారు. ఇదే డ్రెస్ పబ్లిక్ లో అందాలు అన్నీ చూపించేసిందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2023 / 11:47 AM IST

    Pooja Hegde

    Follow us on

    Pooja Hegde: సోషల్ మీడియా యుగంలో ప్రతి విషయానికి జనాలకు సమాధానం చెప్పాలసిందే. విషయం ఏదైనా కానీ నెటిజెన్స్ తమ అభిప్రాయం చెప్పేస్తున్నారు. ముఖ్యంగా సెలెబ్స్ చర్యలను గమనిస్తూ ఉంటారు. వాళ్ళ కట్టు బొట్టు, తిండి, రిలేషన్స్, విజయాలు, అపజయాలు, లగ్జరీ లైఫ్… ఇలా ప్రతి అంశం మీద జనాల దృష్టి ఉంటుంది. ఈ మాత్రం తేడా కొట్టిన ట్రోల్ చేయడానికి రెడీ అయిపోతారు. తాజాగా పూజ హెగ్డే నెటిజెన్స్ కి దొరికిపోయింది. ఓ ఈవెంట్ కి ఆమె హాజరైన డ్రెస్ భిన్నంగా ఉండగా విమర్శలు వెల్లువెత్తాయి.

    ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ కి పూజ హెగ్డే పింక్ కలర్ ట్రెండీ వేర్లో హాజరయ్యారు. కురచైన టాప్ తో సదరు డ్రెస్ కొంచెం వల్గర్ గా ఉంది. దీంతో నెటిజెన్స్ ఆమెపై విమర్శలు సంధించారు. ఇదే డ్రెస్ పబ్లిక్ లో అందాలు అన్నీ చూపించేసిందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పూజ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుండగా అదే స్థాయిలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి.

    మరోవైపు పూజ హెగ్డే కెరీర్ నెమ్మదించింది. ఒక్కసారిగా టాప్ నుండి ఆమె క్రిందకు పడిపోయింది. వరుస పరాజయాలతో పూజ ఆఫర్స్ కోల్పోయారు. ప్రస్తుతం పూజ చేతిలో అధికారికంగా ఒక్క మూవీ లేదు. సాయి ధరమ్ తేజ్ కి జంటగా గంజా శంకర్ మూవీ చేస్తున్నారనే టాక్ ఉంది. అధికారికంగా ప్రకటించలేదు. 2022 నుండి ఆమెకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. రాధే శ్యామ్ అట్టర్ ప్లాప్ కాగా, ఆ వెంటనే విడుదలైన ఆచార్య డిజాస్టర్ అయ్యింది.

    బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రాల్లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. ఎఫ్ 3 మూవీలో స్పెషల్ సాంగ్ చేయగా అది కూడా అటకెక్కింది. దానికి తోడు సైన్ చేసిన జనగణమన మధ్యలో ఆగిపోగా… మహేష్ బాబు గుంటూరు కారం నుండి స్వయంగా ఆమెనే తప్పుకుంది. కష్టాల్లో ఉన్న పూజ హెగ్డే బ్రేక్ కోసం చూస్తుంది. ఆ మధ్య పూజ హెగ్డే మీద ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. సల్మాన్ ఖాన్ తో ఎఫైర్ పట్టుకున్నారు కామెంట్స్ వినిపించాయి.