Bigg Boss 7 Telugu: అమర్ దీప్ కి అనారోగ్యం, మెడికల్ రూమ్ లో సెలైన్లు… బిగ్ బాస్ అనూహ్య నిర్ణయం?

గత కొన్ని వారాలుగా ఆటను మెరుగుపరుచుకుని మళ్ళీ టైటిల్ రేస్ లోకి వచ్చాడు. ఇక ప్రశాంత్, శివాజీ తో స్నేహం పెంచుకోవడం కూడా ప్లస్ అయింది. నిన్నటి టాస్క్ లో అద్భుతంగా పర్ఫార్మ్ చేసాడు అమర్.

Written By: NARESH, Updated On : November 24, 2023 11:42 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కిల్లర్ టాస్క్ నడుస్తుంది. అమర్ దీప్ పోలీస్ అవతారమెత్తి పెర్ఫార్మన్స్ ఇరగదీస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే అమర్ అనారోగ్యం పాలైనట్లు తెలుస్తుంది. హౌస్ లో కి రాక ముందు నటుడు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జానకి కలగనలేదు సీరియల్ తో మరింత పేరు తెచ్చుకున్నాడు. కాగా ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన అమర్ దీప్ ఆటలో వెనకబడిపోయాడు. ప్రశాంత్ తో గొడవ పడి సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ అయ్యాడు.

అయితే గత కొన్ని వారాలుగా ఆటను మెరుగుపరుచుకుని మళ్ళీ టైటిల్ రేస్ లోకి వచ్చాడు. ఇక ప్రశాంత్, శివాజీ తో స్నేహం పెంచుకోవడం కూడా ప్లస్ అయింది. నిన్నటి టాస్క్ లో అద్భుతంగా పర్ఫార్మ్ చేసాడు అమర్. ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఫన్ జెనరేట్ చేస్తూ ఎంటర్టైన్ చేశాడు. కాగా ఈ క్రమంలోనే ఆయన ఒక్క సారిగా అనారోగ్యం పాలైనట్లు సమాచారం. ప్రస్తుతం బిగ్ బాస్ మెడికల్ రూమ్ లో అమర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.

ఆయనకు సెలైన్ కూడా ఎక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అతను హౌస్ నుంచి బయటకు వచ్చేస్తాడు అని ప్రచారం కూడా సాగుతోంది. అమర్ ఆరోగ్యం కుదుట పడకపోతే బయటకు పంపిస్తారన్న చర్చలు బయట జోరుగా సాగుతున్నాయి. కానీ ఇంతవరకు బిగ్ బాస్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు.

సోషల్ మీడియాలో మొన్నటి వరకు ట్రోలింగ్ కి గురైన అమర్ దీప్. ఈ వారం పూర్తిగా ఆటను మార్చేశాడు. బిగ్ బాస్ ఇస్తున్న టాస్కుల్లో వంద శాతం ఎఫోర్ట్స్ పెడుతూ రాణిస్తున్నాడు. గత వారం అమర్ కెప్టెన్సీ టాస్క్ లో పడిన భాధ కి ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. పైగా అదే సమయంలో శివాజీ కి నెగిటివ్ ఎపిసోడ్ లు పడటంతో .. అమర్ గ్రాఫ్ బాగా పెరిగింది. దీంతో అమర్ టాప్ 5 లో ఉండటం పక్కా అంటున్నారు. మరి అమర్ అనారోగ్యం గురించి వస్తున్న వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.