PellisandaD: దర్శకేంద్రుడి స్వప్నసుందరి… ‘శ్రీలీల’ ఎవరో తెలుసా?

PellisandaD: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాల్లో ఒకటి పెళ్లి సందడి. 25 ఏళ్ల క్రితం శ్రీకాంత్​ హీరోగా నటించన ఈ చిత్రం ఆనాటి యూత్​ను విపరీతంగా ఆకట్టుకంది. మళ్లీ 25 ఏళ్ల తర్వాత సరికొత్తగా రూపొందించారు రాఘవేంద్రరావు. శ్రీకాంత్​ తనయుడు రోషన్​ను కథానాయకుడిగా పరియం చేస్తూ తెరకెక్కించారు. అయితే ఈ రీమేక్​లో స్వప్న సుందరిగా అలరించనున్న ఆ అందాల రాశి శ్రీ లీల. రాఘవేంద్రరావు తెలుగు తెరపై పరిచయం చేయబోతున్న ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని ఆసక్తికర […]

Written By: Raghava Rao Gara, Updated On : October 11, 2021 7:30 pm
Follow us on

PellisandaD: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాల్లో ఒకటి పెళ్లి సందడి. 25 ఏళ్ల క్రితం శ్రీకాంత్​ హీరోగా నటించన ఈ చిత్రం ఆనాటి యూత్​ను విపరీతంగా ఆకట్టుకంది. మళ్లీ 25 ఏళ్ల తర్వాత సరికొత్తగా రూపొందించారు రాఘవేంద్రరావు. శ్రీకాంత్​ తనయుడు రోషన్​ను కథానాయకుడిగా పరియం చేస్తూ తెరకెక్కించారు. అయితే ఈ రీమేక్​లో స్వప్న సుందరిగా అలరించనున్న ఆ అందాల రాశి శ్రీ లీల. రాఘవేంద్రరావు తెలుగు తెరపై పరిచయం చేయబోతున్న ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా…

అమెరికాలో 2001, జూలై 14న జన్మించిన శ్రీలీల సినీ పరిశ్రమకు కొత్తేం కాదు. గతంలో కిస్​, భరాటి వంటి కన్నడ చిత్రాల్లో నటించి అందం, అభినయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సంప్రదాయం, గ్లామర్​ ఏ లుక్​ లో చూసినా తన అందంతో కుర్రకారును కవ్విస్తుంటుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మెడిసిన్​ చేస్తూ డాక్టర్​ కావాలనే తన కలను నెరవేర్చుకోవాలనుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

ఈ క్రమంలోనే రాఘవేంద్రరావు ఆమెకు ఈ పెళ్లిసందడి చిత్రంలో హీరోయిన్​గా అవకాశం కల్పించారు. ఇప్పటికే విడుదలైన టీజర్​, సాంగ్స్​ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం కుడా తన తండ్రి శ్రీకాంత్​ నటించిన సినిమా లాగే ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అక్టోబరు 15న ఈ చిత్రం విడుదల కానుంది.