Priyanka Chopra : మన ఇండియన్ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వారిలో ఒకరు ప్రియాంక చోప్రా(Priyanka Chopra). ఈమె తమిళ సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలను సంపాదించిన ఈ మిస్ వరల్డ్ బ్యూటీ, అక్కడి టాప్ 3 స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా సుమారుగా రెండు దశాబ్దాలు ఏలింది. కేవలం అందంతో మాత్రమే కాకుండా, అద్భుతమైన నటన కనబరుస్తూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో పీక్ స్టేజ్ కి వెళ్లిన తర్వాత ఈమె అడుగులు చిన్నగా హాలీవుడ్ వైపు వేసేలా చేశాయి. ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ దక్కించుకున్న ప్రియాంక చోప్రా కి, ‘బే వాచ్’ చిత్రం లో మెయిన్ విలన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా హాలీవుడ్ లో పెద్ద హిట్ అవ్వడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
Also Read : పెద్ది’ షాట్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..? ఎలా క్రియేట్ చేశారంటే!
వరుసగా హాలీవుడ్ లో విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ, అక్కడ మోస్ట్ డిమాండ్ ఆర్టిస్టులలో ఒకరిగా మారిపోయింది ప్రియాంక చోప్రా. అలాంటి హీరోయిన్ కి ఇప్పుడు మరో అరుదైన ఘనత దక్కింది. ప్రపంచం లో వివిధ రంగాలకు సేవలు అందిస్తూ, గొప్ప ఆదరణ దక్కించుకున్న ప్రముఖలు గుర్తిస్తూ గోల్డ్ హౌస్ గాలా కొన్ని అవార్డ్స్ ని ప్రకటించింది. అందులో ప్రియాంక చోప్రా కు గ్లోబల్ వాన్ గార్డ్ హానర్ అవార్డు దక్కింది. ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు, వ్యాపారవేత్తల నడుమ మన ఇండియన్ హీరోయిన్ చోటు దక్కించుకోవడం అనేది కేవలం బాలీవుడ్ వాళ్ళకే కాదు, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీస్ కి చెందిన వాళ్ళు గర్వపడాల్సిన విషయమిది. ఇకపోతే ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తుందని కొందరు, లేదు విలన్ గా నటిస్తుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏమిటి అనేది డైరెక్టర్ రాజమౌళి అధికారికంగా చెప్తే కానీ తెలియదు అనేది వాస్తవం. ఇప్పటికే ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, రెండవ షెడ్యూల్ ని అతి త్వరలోనే ప్రారంభించుకోనుంది. మొదటి షెడ్యూల్ లో పాల్గొన్న ప్రియాంక చోప్రా, నెల రోజుల పాటు సాగే రెండవ షెడ్యూల్ లో కూడా గ్యాప్ లేకుండా పాల్గొనబోతుంది. చూస్తుంటే సినిమా మొత్తం ఆమె మహేష్ బాబు కలిసి సమానంగా స్క్రీన్ స్పేస్ ని పంచుకునేలా ఉంది. మరి హాలీవుడ్ మిలియన్ డాలర్స్ రెమ్యూనరేషన్ తీసుకునే ఒక హీరోయిన్, టాలీవుడ్ పాన్ ఇండియన్ సినిమా చేస్తుందంటే, ఆ మాత్రం పవర్ ఫుల్ క్యారక్టర్, స్క్రీన్ స్పేస్ లేకపోతే ఎలా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : అఖండ 2′ లో విజయశాంతి..ఎలాంటి పాత్రలో కనిపించబోతుందంటే!