Peddi Release Postponed again: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రస్తుతం ‘పెద్ది'(Peddi Movie) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా కోసం కేవలం రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ కంటెంట్ బ్లాస్ట్ అయ్యింది. ఇది కదా సరైన పాన్ ఇండియన్ హీరో సినిమా అంటే అనే ఫీలింగ్ ని రప్పించింది ఈ చిత్రం. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉండుంటే ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ షూటింగ్ చాలా రోజుల వరకు బ్యాలన్స్ ఉండడం తో ఏప్రిల్ 30 కి వాయిదా పడింది. అయితే ఈ చిత్రం అప్పటికీ కూడా విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే షూటింగ్ పూర్తి అవ్వడానికి ఇంకా 20 రోజుల సమయం ఉందట.
ప్రస్తుతానికి అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ 20 రోజుల షూటింగ్ తో పాటు, రీ రికార్డింగ్ వర్క్ కూడా పూర్తి చెయ్యాలి. డైరెక్టర్ బుచ్చి బాబు మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ చేత ఫిబ్రవరి 18 లోపు ఎంత కుదిరితే అంత రీ రికార్డింగ్ వర్క్ పూర్తి చేయించుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఆ తర్వాత రంజాన్ మాసం ప్రారంభం అవ్వబోతుంది. ఈ మాసం లో రెహమాన్ పని చేయడానికి ఇష్టం చూపించడట. దీంతో అనుకున్న సమయానికి సినిమా రెడీ అవుతుందా లేదా అనే భయం మేకర్స్ లో ఉన్నది. అందుకే సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఈ వార్త తెలిసిన వెంటనే రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్రమైన ఆగ్రహాన్ని మేకర్స్ మీద వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది అయితే ఏకంగా రామ్ చరణ్ ని ట్యాగ్ చేసి తిట్టేస్తున్నారు. కనీసం ప్రమోషనల్ కంటెంట్ ని అయినా ఎంజాయ్ చేద్దామని అనుకుంటే, ఈ సినిమాకు సంబంధించిన రెండవ పాటని కూడా వాయిదా వేశారు. ముందుగా ఈ పాటను శివరాత్రి సందర్భంగా విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ లిరికల్ వీడియో వర్క్ చాలా వరకు పెండింగ్ ఉండడం తో మార్చి మొదటి వారానికి ఈ పాటని విడుదల చెయ్యాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అభిమానులకు అసలు నచ్చడం లేదు. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాడు అని అనిపించే రేంజ్ సినిమా వస్తుంటే, ఈ అడ్డంకులు ఏంటి అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.