Peddi Movie Release Delay: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) మూవీ షూటింగ్ అప్డేట్స్ అభిమానులకు అసలు ఏ మాత్రం అంతుచిక్కడం లేదు. నిన్న మొన్నటి వరకు కేవలం రెండు మూడు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందంటూ వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఐటెం సాంగ్ షూటింగ్ మినహా, ఇక ఏమి బ్యాలన్స్ లేదని, ముందుగా ప్రకటించినట్టుగానే ఏప్రిల్ 30 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారని టాక్ నడించింది. కానీ ఇప్పుడు ఈ చిత్రం ఏప్రిల్ 30 న విడుదల అవ్వడం లేదు, అలా అని మే నెలలో కూడా విడుదల అవ్వడం లేదు. జూన్ 25 న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అప్పటికీ సెట్ అవ్వకపోతే ఇక ఏకంగా ఆగస్టు 13 న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ప్లాన్ లో కూడా ఉన్నారట మేకర్స్.
మరోపక్క అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్ హీరో గా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రాన్ని ఏప్రిల్ 30 నుండి జూన్ 26 కి వాయిదా వేసాడు. కేవలం రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ తో క్లాష్ పడడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారికంగా ఒక ప్రెస్ నోట్ కూడా వదిలారు. జూన్ 26 కి విడుదల ప్లాన్ కి తగ్గట్టు ఓటీటీ డీల్ ని కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ‘పెద్ది’ చిత్రం జూన్ 25 న విడుదల కాబోతుంది అనే వార్తలు రావడం తో ‘లెనిన్’ మేకర్స్ తీవ్రమైన అసంతృప్తి కి గురయ్యారట. కనీసం మొన్న విడుదల చేసిన గ్లింప్స్ వీడియో లో అయినా జూన్ 25 కి విడుదల చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసుంటే బాగుండేది కదా అని తమ సన్నిహితుల ముందు అక్కినేని నాగార్జున అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు ఏమి చెయ్యాలి ?, మళ్లీ ‘లెనిన్’ చిత్రాన్ని ఏప్రిల్ 30 కి ప్రీ పోన్ చెయ్యాలా ?, లేదంటే మళ్లీ వాయిదా వెయ్యాలా ? అనేది అంతు చిక్కని విషయం గా మారిందట. రెండిట్లో ఏది జరిగిన ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయ్యినట్టే. అదే కనుక జరిగితే నిర్మాత నాగార్జున కి 30 నుండి 40 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లుతుంది. పోనీ ముందు చెప్పినట్టుగానే జూన్ 26న ఈ చిత్రాన్ని ‘పెద్ది’ కి పోటీగా విడుదల చెయ్యాలా?, వద్దా ?, అనే ఆలోచన కూడా చేస్తున్నారట. ఏది ఏమైనా ‘పెద్ది’ కారణంగా ‘లెనిన్’ టీం చాలా ఇబ్బందులనే ఎదురుకుంటుంది. కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు, అనేక చిన్న సినిమాలు కూడా ‘పెద్ది’ దాటికి బలి అయ్యాయి.