Peddi : రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు (Buchhi Babu) డైరెక్షన్ లో వస్తున్న ‘పెద్ది ‘ (Peddi) సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క రికార్డు కూడా బ్రేక్ అవ్వబోతుంది అంటూ రామ్ చరణ్ చెబుతుండడం విశేషం. ఇక బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద మొన్నటిదాకా కొంతమందికి కొన్ని అనుమానాలైతే ఉండేవి. కానీ ఒక్కసారి గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరిలో మంచి కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ ఏదో ఒక పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయబోతున్నాడనే నమ్మకం ప్రతి ఒక్కరి లో కలిగింది. తద్వారా ఈ సినిమాని చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో సాగుతున్న క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి సీను కూడా చాలా ఉత్కంఠ భరితంగా ఉంటుందని ఈ సినిమాని చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు సిటీ ఎడ్జ్ లో కూర్చుంటారని బుచ్చిబాబు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. క్లైమాక్స్ లో క్రికెట్ అనేది అల్టిమేట్ పాత్ర పోషించబోతుందట.
Also Read : ‘పెద్ది’ పై రామ్ గోపాల్ వర్మ వైరల్ ట్వీట్..కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!
రామ్ చరణ్ క్రికెట్ ఆడితే ఒక వర్గం విజయాన్ని సాధిస్తుంది, ఆడకపోతే మరొక వర్గం విజయాన్ని సాధిస్తుందని నేపథ్యంలో రామ్ చరణ్ ను కావాలనే కొంతమంది క్రికెట్ కి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తారట. మొత్తానికైతే రామ్ చరణ్ వాళ్ళందరిని దాటుకొని కొన్ని గాయాలతో పాటు ఉన్నప్పటికి క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెడతాడట.
ఇక ఆయన బ్యాట్ తో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసి తన మ్యాచ్ ను గెలిపించుకోబోతున్నాడు అనేది ఇక్కడ చాలా క్లియర్ కట్ గా తెలియబోతున్నట్టుగా తెలుస్తోంది. క్లైమాక్స్ మొత్తం రామ్ చరణ్ బీభత్సాన్ని చూపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…
ఇక ఇదే కనక నిజమైతే మాత్రం రామ్ చరణ్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఈ సినిమా పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయబోతుందనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయి కూడా మరింత రేంజ్ లో ముందుకు దూసుకుపోతోందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
Also Read : పెద్ది మూవీకి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ మైనస్ కానుందా.?