Peddi Overseas Box Office: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చి , మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , అద్భుతమైన ఓపెనింగ్ వసూళ్లను సొంతం చేసుకుంది. కేవలం మొదటి రోజు మాత్రమే కాకుండా, రెండవ రోజు కూడా ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్నఉవంటి ట్రెండ్ చూస్తుంటే ఈ చిత్రానికి 2 వ రోజున ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చేలా ఉందని అంటున్నారు. ఈ వీకెండ్ ముగిసే సమయానికి ఈ చిత్రం కచ్చితంగా 250 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అంతా బాగానే ఉంది కానీ , ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఓవర్సీస్ మొత్తానికి కలిపి ఈ చిత్రం 10 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది అన్నమాట. ప్రీమియర్ షోస్ నుండి దాదాపుగా 27 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ 7 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమా బిజినెస్ ఏ రేంజ్ లో ఉంది అని చెప్పడానికి. అయితే ఈ చిత్రం ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం దాదాపుగా అసాధ్యం అనే అంటున్నారు ట్రేడ్ పండితులు. నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి 1.9 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా ఈ మూడు రోజులకు కలిపి మరో 1.5 మిలియన్ డాలర్స్ ని రాబడుతుందని , ఓవరాల్ గా వీకెండ్ కి 3.4 మిలియన్ డాలర్లు , అదే విధంగా ఓవర్సీస్ మొత్తం కలిపి 4.8 మిలియన్ డాలర్లు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ఓవర్సీస్ లో మన తెలుగు సినిమాలకు వీకెండ్ తర్వాత భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం లేదు. కాబట్టి మహా అయితే ఈ చిత్రం మరో 1 మిలియన్ డాలర్లు ఓవర్సీస్ ఫుల్ రన్ లో రాబట్టే అవకాశాలు ఉన్నాయని , ఓవరాల్ గా 5.8 మిలియన్ డాలర్లు రాబడుతుందని , దాదాపుగా 4.2 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. దాదాపుగా అన్ని ప్రధాన సైట్స్ లో ‘పెద్ది’ చిత్రానికి అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి, అయినప్పటికీ ఈ రేంజ్ ఫ్లాప్ గా నిలబడడానికి కారణం ఏంటో కనిపెట్టలేకపోతున్నారు ట్రేడ్ అభిమానులు. కచ్చితంగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కడం , ఓవర్సీస్ ఆడియన్స్ కి అది అంతగా నచ్చకపోవడం వల్లే, ఈ సినిమా ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ , ‘పెద్ది’ కి ఓవర్సీస్ లో ఇలాంటి ఫలితం వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.
