Homeఎంటర్టైన్మెంట్Peddi opening day collections: అంచనాలను దాటేసిన 'పెద్ది' ఓపెనింగ్స్.. మ్యాట్నీ వరకు వచ్చిన గ్రాస్...

Peddi opening day collections: అంచనాలను దాటేసిన ‘పెద్ది’ ఓపెనింగ్స్.. మ్యాట్నీ వరకు వచ్చిన గ్రాస్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు..

Peddi opening day collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ నేడు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చి , అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. నిన్న రాత్రి ప్రీమియర్ షోస్ ద్వారా మొదలైన ఈ సినిమాకు ఆడియన్స్ ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత రెగ్యులర్ షోస్ మొదలయ్యాక ఆడియన్స్ నుండి పర్లేదు, యావరేజ్ అనే రేంజ్ టాక్ వచ్చింది. ఓవరాల్ గా ఎక్కడా ఫ్లాప్ టాక్ అయితే రాలేదు. కరువు లో ఉన్న టాలీవుడ్ కి ఈ మాత్రం కంటెంట్ చాలు , దుమ్ము దులిపేస్తుందని అంతా అనుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రానికి ఇండియా లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ దక్కాయి. ఓవర్సీస్ లో యావరేజ్ రేంజ్ ఓపెనింగ్ వచ్చింది. మ్యాట్నీ షోస్ వరకు ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి నమోదైన గ్రాస్ అందరికీ ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి.

దాదాపుగా 56 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , కేవలం మ్యాట్నీ షోస్ వరకు నమోదు అయ్యాయి. ఇక ఫస్ట్ షోస్ , సెకండ్ షోస్ నుండి ఏ రేంజ్ గ్రాస్ వస్తుందో మీరే ఊహించుకోవచ్చు. ఈమధ్య కాలం లో ఒక స్టార్ హీరో సినిమాకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ దక్కలేదు. ముఖ్యంగా బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 47 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. మొదటి రోజు ఈ ఒక్క యాప్ నుండే 6 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమాకు బుక్ మై షో యాప్ నుండి గంటకు 40 వేల టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో నిన్న మొన్నటి వరకు కల్కి , ది రాజాసాబ్ , పుష్ప 2 చిత్రాలు మాత్రమే ఉండేవి , కానీ ఇప్పుడు ఆ జాబితాలోకి పెద్ది కూడా చేరిపోయింది.

ఇక ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టీ చూస్తుంటే ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 120 నుండి 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రామ్ చరణ్ కి సోలో హీరో గా ఇదే మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ ఓపెనింగ్ సినిమా అనుకోవచ్చు. హిందీ వెర్షన్ కి సంబంధించిన బుకింగ్స్ కూడా బాగా పికప్ అయ్యాయి. ఇదే ఊపు వీకెండ్ వరకు కొనసాగితే మాత్రం , 500 కోట్ల గ్రాస్ వసూళ్లు ఫుల్ రన్ లో కచ్చితంగా వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version