Peddi First Half Report: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ కి వచ్చిన రామ్ చరణ్ సూపర్ హిట్స్ అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతుండడం విశేషం…మరి కొద్ది గంటల్లో పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలకి ఈ సినిమా స్పెషల్ షో అయితే వేశారు. అది చూసిన ప్రతి ఒక్కరు సినిమా బాగుందని చెప్తున్నారు. మొత్తానికైతే సినిమా ఫస్టాఫ్ బాగున్నప్పటికి సెకండ్ హాఫ్ విషయంలోనే కొంతవరకు డల్ అయిందనే విషయం తెలుస్తుంది. సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయట. కానీ క్లైమాక్స్ విషయంలోనే ప్రేక్షకులు ఎలా జీర్ణించుకుంటారు. ఒక కమర్షియల్ స్టార్ హీరో కి ఒక వైకల్యాన్ని పెట్టి గేమ్ ఆడించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే ధోరణిలోనే ఇప్పుడు ఆలోచనలైతే సాగుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా బుచ్చిబాబు ఈ సబ్జెక్టు ను చాలా బాగా హ్యాండిల్ చేశారని కొంతమంది అంటుంటే మరి కొంత మంది మాత్రం రామ్ చరణ్ అతని అభిమానులు ఎలా చూస్తారు అనే దాని మీదనే ఈ సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉందని మరి కొంతమంది చెబుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుందని రామ్ చరణ్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. కాబట్టి వాళ్ళ ఆశల మీద నీళ్ళు చల్లకుండా ఉంటే బాగుంటుందని మరి కొంత మంది చెబుతున్నారు. ఈ సినిమాని చూసిన కొంతమంది సినిమా సెలబ్రిటీలు సైతం సినిమా మీద కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఇది ఎంతవరకు పర్ఫెక్ట్ గా కుదిరింది సినిమా అనుకున్న రేంజ్ లో వచ్చిందా లేదా ఫైనల్ గా ఈ మూవీ చూసి ప్రేక్షకుడు ఏం చెబుతాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటల పాటు వెయిట్ చేయాల్సిందే. ఇక రేపు నైట్ నుంచి ఈ సినిమా కి సంబంధించిన ప్రీమియర్స్ పడబోతున్నట్టుగా తెలుస్తుంది…
