Peddi Movie Release Date Delay: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం మరోసారి వాయిదా పడింది. ఈ నెల 30 న విడుదల అవ్వాల్సిన ఈ చిత్రాన్ని , జూన్ నెలకు వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. అది జూన్ 4 న విడుదల చెయ్యాలా ?, లేదంటే జూన్ 25 న విడుదల చెయ్యాలా అనేది ఇంకా ఖరారు అవ్వలేదు. అభిమానులు ఈ చిత్రం వాయిదా పడినందుకు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ బుచ్చి బాబు ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా లో పచ్చి బూతులు తిడుతున్నారు ఫ్యాన్స్. పెద్ద పెద్ద భారీ సీజీ వర్క్స్ ఉన్న సినిమాలు కూడా పూర్తి అవుతున్నాయి. కానీ నువ్వు కేవలం ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ కమర్షియల్ సినిమాకు ఇన్ని రోజుల సమయం తీసుకుంటున్నావ్ అంటూ మండిపడుతున్నారు.
ఇదంతా పక్కన పెడితే, ఈ చిత్రం లో ఒక ఐటెం సాంగ్ చిత్రీకరణ బ్యాలన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఐటెం సాంగ్ ని ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో చిత్రీకరిస్తారని నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా లో ప్రచారం సాగింది. ఆమెని బుచ్చి బాబు సంప్రదించిన విషయం వాస్తవమే , కానీ రెమ్యూనరేషన్ భారీ గా డిమాండ్ చేయడం తో ఆమెని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఆమె స్థానం లోకి వేరే టాప్ హీరోయిన్ ని తీసుకుంటారని అనుకుంటే, నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ హీరోయిన్ మానస వారణాసి తో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. మానస ని తీసుకోవడం వల్ల సినిమాకు ఎలాంటి అదనపు అడ్వాంటేజ్ వచ్చే అవకాశాలు లేవు. అదే ఒక పాపులర్ బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకొని ఉండుంటే నార్త్ ఇండియా లో కలెక్షన్స్ బాగా కలిసొచ్చేవి అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యినట్టే . ఈ సినిమా వాయిదా పడడానికి ముఖ్య కారణం, సెకండ్ హాఫ్ కి సంబంధించిన కొన్ని సీజీ షాట్స్ పూర్తి అవ్వకపోవడమే , అదే విధంగా ఏ ఆర్ రెహమాన్ అందించాల్సిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ కూడా బ్యాలన్స్ ఉండిపోయింది అట. అనుకున్న సమయానికి ఇవన్నీ పూర్తి అయ్యే అవకాశాలు లేకపోవడం వల్లే, క్వాలిటీ విషయం లో ఎలాంటి వెనకడుగు వెయ్యని బుచ్చి బాబు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.