Peddi Movie Negative Publicity: గ్లోబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్… ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. త్రిబుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించిన ఆయన గేమ్ చేంజర్ సినిమాతో కొంతవరకు డీలా పడ్డాడు. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగాడు… అయితే ఈ సినిమా మీద గత కొన్ని రోజుల నుంచి చాలామంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కారణం ఏదైనా కూడా రామ్ చరణ్ సినిమా వస్తుందంటే చాలు చాలా మందికి నెగెటివ్ కామెంట్స్ చేయడం అలవాటైపోయింది. ఇక ఇలాంటి ధోరణిలోనే రివ్యూవర్స్ సైతం రామ్ చరణ్ సినిమా మీద నెగెటివ్ కామెంట్స్ చేయడం పట్ల వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా నెగెటివ్ కామెంట్స్ చేయిస్తున్నది ఎవరు అనేది తెలుసుకోవడానికి మెగా అభిమానులు ప్రయత్నం చేస్తున్నారు.
ఏది ఏమైనా కూడా పెద్ది సినిమా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ సాధించిన తర్వాతే వీళ్ళందరికి సమాధానం చెబుతామంటు మరి కొంతమంది రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు రామ్ చరణ్ తో పాటు వాళ్ళ అభిమానులు సైతం ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు… క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.
అలాగే స్పోర్ట్స్ స్పిరిట్ ను నిలబెడుతూ, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా మారుతుందని సినిమా మేకర్స్ తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘చికిరి చికిరి’ సాంగ్ ప్రేక్షకులందరిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ గ్లింప్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అలాగే సినిమాలో ఫైట్స్ కూడా అద్భుతంగా చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఢిల్లీలో షూటింగ్ జరుపుకుంటుంది. తొందరగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి మార్చి 26వ తేదీన అనుకున్న సమయానికి ఈ సినిమాని తీసుకురావాలనే లక్ష్యంతో బుచ్చిబాబు కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా కనక మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తే ఈ సినిమాతో తను మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న వాడవుతాడు…