Peddi Hindi collections 12 days: వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తూ , ముందుకు పోతున్న విధానం చూసి , బయ్యర్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నారు. ఈ స్థాయి వసూళ్లు కేవలం సంక్రాంతి సీజన్ కి మాత్రమే పరిమితం అని భావించిన కొంతమంది విశ్లేషకుల నోర్లు మూయించింది ఈ చిత్రం. సోమవారం రోజున అనగా 12వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ఎలాంటి సునామీ సృష్టిస్తూ ముందుకు వెళ్తుంది అనేది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ చిత్రం , హిందీ వెర్షన్ లో డిజాస్టర్ కా బాప్ గా నిలవడం శోచనీయం.
ఈ సినిమా కంటెంట్ అక్కడి ఆడియన్సు పట్టుకునే విధంగానే ఉంది , కానీ ఎందుకో బాక్స్ ఆఫీస్ వద్ద జోరు చూపించడం లేదు. విడుదలకు ముందు ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం హిందీ వెర్షన్ కి గానూ పాతిక కోట్ల రూపాయలకు జరిగింది. అంటే ఈ చిత్రం కచ్చితంగా పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సిందే. కానీ ఇప్పటి వరకు కేవలం 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది అట. అంటే సగం కూడా ఇప్పటి వరకు రీకవరీ అవ్వలేదు. రోజుల వారీగా ఈ చిత్రానికి హిందీ వెర్షన్ నుండి నమోదైన నెట్ వసూళ్లు ఎంతో ఒకసారి వివరంగా చూద్దాము. మొదటి రోజున హిందీ వెర్షన్ నుండి ఈ చిత్రం దాదాపుగా 3 కోట్ల 25 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత రెండవ రోజున 2 కోట్ల 50 లక్షలు , 3 వ రోజున 3 కోట్ల 10 లక్షలు , 4 వ రోజున 3 కోట్ల 65 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.
ఇది చాలా డీసెంట్ రేంజ్ నెట్ వసూళ్లు అని చెప్పొచ్చు. ఈ స్టడీ కలెక్షన్స్ ట్రెండ్ వర్కింగ్ డేస్ లో కూడా కొనసాగితే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవ్వుద్దని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. 5 వ రోజున కేవలం 1 కోటి 30 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , 6 వ రోజున 1 కోటి 55 లక్షలు , 7 వ రోజున 1 కోటి 15 లక్షలు , 8 వ రోజున 1 కోటి 10 లక్షలు , 9 వ రోజున 50 లక్షలు , 10 వ రోజున 90 లక్షలు , 11 వ రోజున 1 కోటి 20 లక్షలు , 12 వ రోజున 55 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 12 రోజుల్లో 20 కోట్ల 75 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు , 26 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ వసూల్ కేవలం 11 కోట్లు మాత్రమే. లాంగ్ రన్ లో మరో 2 కోట్ల షేర్ వసూళ్లు రావొచ్చు.
