Peddi And The Paradise
Peddi And The Paradise: వచ్చే ఏడాది సమ్మర్ వరుసగా పాన్ ఇండియన్ సినిమాలతో ఫుల్ అయిపోనుంది. ముందుగా నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ‘ది ప్యారడైజ్'(The Paradise Movie) చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన టీజర్ వీడియో ద్వారా తెలిపాడు. నేడు విడుదలైన రామ్ చరణ్(Global Star Ram Charan) ‘పెద్ది'(Peddi Movie) మూవీ టీజర్ లో కూడా మార్చి 27 న రాబోతున్నట్టు తెలిపారు. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మార్చి 26 న కన్నడ సూపర్ స్టార్స్ లో ఒకరైన యాష్(Rocking Star Yash) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్'(Toxic Movie) విడుదల కానుంది. అదే విధంగా అదే రోజున బాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ రణబీర్ కపూర్(Ranbir Kapoor), విక్కీ కౌశల్(Vicky Kaushal) మల్టీ స్టారర్ చిత్రం ‘లవ్ & వార్'(Love & War) విడుదల కానుంది. సంజయ్ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali) ఈ చిత్రానికి దర్శకుడు. అన్ని సినిమాలు భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న సినిమాలే.
Also Read: ఆ పూజారి కారణంగా బాలయ్య జీవితం రివర్స్ అయ్యిందా? వెలుగులోకి వచ్చిన నిజాలు!
ఇవన్నీ ఒకే రోజున విడుదల అయితే కచ్చితంగా అన్ని సినిమాలు నష్టపోవాల్సిందే. ముఖ్యంగా రికార్డ్స్ వేటలో ఉండే రామ్ చరణ్ లాంటి సూపర్ స్టార్స్ కి సోలో రిలీజ్ డేట్ అత్యవసరం. ఇంతటి బిజీ షెడ్యూల్ లో విడుదల చేస్తే అనుకున్న రేంజ్ ఓపెనింగ్ వసూళ్లు రావు. అయితే తెలుగు వరకు నేచురల్ స్టార్ నాని ‘ప్యారడైజ్’ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నాని కి మెగా ఫ్యామిలీ తో మంచి సాన్నిహిత్యం ఉంది. త్వరలోనే ఆయన మెగాస్టార్ చిరంజీవి ని హీరోగా పెట్టి ఒక సినిమాని నిర్మించబోతున్నాడు. కాబట్టి రామ్ చరణ్ కచ్చితంగా మార్చి 27 న వస్తానంటే నాని వెనక్కి వెళ్లక తప్పదు. ఇక మరోపక్క బాలీవుడ్ లో పెద్ది కి ‘లవ్ & వార్’ మూవీ రూపం లో భారీ పోటీ ఉంటుంది. కానీ ఈ సినిమా కచ్చితంగా మార్చి నెలలో విడుదల చేస్తామని చెప్పారు కానీ, ఏ తేదీన విడుదల చేస్తారనేది మాత్రం చెప్పలేదు.
అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 27న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక రూమర్ మాత్రమే ప్రచారం లో ఉంది. అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి మార్చి మొదటి వారం లో అయినా విడుదల కావొచ్చు. కాబట్టి మార్చి 26న కన్నడ సినీ పరిశ్రమ నుండి ‘టాక్సిక్’, అలాగే మన టాలీవుడ్ నుండి ‘పెద్ది’ చిత్రాలు మాత్రమే విడుదల అవుతాయి. ‘టాక్సిక్’ చిత్రం ఈమధ్య ఎక్కువగా రీ షూటింగ్స్ ని జరుపుకుంటుంది టాక్. ఒకవేళ అదే నిజమైతే సినిమా వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ కారణం చేత ‘పెద్ది’ కి సోలో విడుదల తేదీ దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ నిజంగా సోలో రిలీజ్ డేట్ దొరికితే మాత్రం రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ బ్యాటింగ్ మామూలు రేంజ్ లో ఉండదు అనే చెప్పాలి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.