Peddi and Paradise : ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వరుసగా సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ (Ram Charan) హీరోగా పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రీసెంట్ గా రిలీజ్ అయింది. యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరికి ఇది నచ్చడమే కాకుండా ఒక్కసారిగా ఈ సినిమా మీద తారాస్థాయిలో అంచనాలైతే పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇదిలా ఉంటే నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ప్యారడైజ్ సినిమా గ్లింప్స్ ని కూడా గత నెల రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ కి కూడా చాలా మంచి గుర్తింపు రావడంతో ఈ సినిమా మీద కూడా చాలా మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 26వ తేదీన సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : ఒక్కరోజు గ్యాప్ లో రానున్న’పెద్ది’, ‘ది ప్యారడైజ్’..నాని వెనక్కి వెళ్ళక తప్పదా?
అయితే రెండు సినిమాల మధ్య ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉండడంతో ఈ రెండు సినిమాల మధ్య క్లాష్ అయితే ఉంటుంది అంటూ కొంతమంది కొన్ని కామెంట్లేతే చేస్తున్నారు. ఇక మరికొంతమంది మాత్రం నాని తో రామ్ చరణ్ కు పోటీ ఏంటి అంటూ కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరూ దర్శకులు కూడా సుకుమార్ శిష్యులే కావడం వల్ల సుకుమార్ రంగంలోకి దిగి శ్రీకాంత్ ఓదెల సినిమాని పోస్ట్ పోన్ చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది.
శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా అనుకున్న సమయానికి పెద్ది సినిమాని రిలీజ్ చేసి భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని రామ్ చరణ్ బరిలోకి దిగుతున్నాడు. కాబట్టి ఆ సినిమాకి పోటీగా ప్యారడైజ్ ఉండకూడదని తను కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక రెండు సినిమాలు వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ అయిన కూడా రెండు సినిమాలకు మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. ఈ రెండు సినిమాలు పోటీగా రావడం వల్ల రెండు సినిమాలకు భారీగా నష్టం వాటిల్లే అవకాశాలైతే ఉన్నాయంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం.
Also Read : ‘పెద్ది’ పై రామ్ గోపాల్ వర్మ వైరల్ ట్వీట్..కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!