Peddi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో రామ్ చరణ్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేల చేస్తున్నాయి. త్రిబుల్ ఆర్ సినిమాతో పెను ప్రభంజనాలను సృష్టించిన ఆయన ఇప్పుడు బుచ్చిబాబు (Buchhi Babu) డైరెక్షన్ లో చేస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమాతో మరోసారి భారీ విక్టరీని సాధించే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ వచ్చి ప్రేక్షకుల్లో విశేషమైన స్పందనను సంపాదించుకుంది. ఇక దాంతో పాటుగా ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చి 27వ రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఇప్పటినుంచే సినిమాకు సంబంధించిన కసరత్తులు చేస్తూ భారీ గుర్తింపుంజ్ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ సెట్ లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి ఈ యాక్షన్ ఎపిసోడ్ చాలా కీలకంగా మారబోతుందట. అలాగే క్రికెట్ ఎపిసోడ్ ఎంత హైలెట్ గా నిలవబోతుందో ఈ రైల్వే స్టేషన్ ఫైట్ సీక్వెన్స్ కూడా అంతే హైలెట్ గా నిలుస్తుందట…మొత్తానికైతే ఈ రెండు ఎపిసోడ్లు సినిమా మొత్తాన్ని మలుపు తిప్పుతాయని చెబుతూనే సినిమా మీద భారీ అంచనాలను పెంచుతున్నారు. ప్రతి ఒక్కరికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతుంది అంటూ బుచ్చిబాబు తన సన్నిహిత వర్గాల దగ్గర తెలియజేస్తున్నాడు.
Also Read : పెద్ది’ పై రామ్ గోపాల్ వర్మ వైరల్ ట్వీట్..కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!
మరి మొత్తానికైతే రామ్ చరణ్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన మార్కెట్ పదిలంగా ఉంటుంది. లేకపోతే మాత్రం గేమ్ చేంజర్ సినిమాతో భారీగా నష్టపోయిన ఆయన ఒక్కసారిగా డీలపడాల్సిన పరిస్థితి అయితే రావచ్చు.
అందుకే బుచ్చిబాబుకి సైతం రామ్ చరణ్ కొన్ని సలహాలను ఇస్తూ సినిమా లేట్ అయిన పర్లేదు కానీ చాలా బాగా చిత్రీకరించాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక బుచ్చిబాబు చెప్పిన కథను చెప్పినట్టుగా తీసినా కూడా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ తెలియజేశాడు.
మరి తను అనుకున్నట్టుగానే బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తాడా ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో ఆయన ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : పెద్ది మూవీకి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ మైనస్ కానుందా.?