Peddi 13 Days Box Office: ‘పెద్ది’ జోరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ఆడియన్స్ కి కొత్త సినిమాలు లేకపోవడం తో , ‘పెద్ది’ తప్ప మరో ఛాయస్ లేకుండా పోయింది. అందుకే ఈ చిత్రానికి వర్కింగ్ డేస్ లో కూడా తిరుగులేని షేర్స్ నమోదు అవుతున్నాయి. ఈ రేంజ్ లాంగ్ రన్ ని చూసి మన ఇండస్ట్రీ ఎన్నేళ్లు అయ్యిందో, రామ్ చరణ్ సినిమాకు హిట్ టాక్ వస్తే చాలు , బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఎక్కడ మొదలై , ఎక్కడ ఆగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు అని ట్రేడ్ విశ్లేషకులు అంటుంటారు. అలా ఎందుకు అంటారో రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ చిత్రం ఒక ఉదాహరణ. 13 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి , ప్రాంతాల వారీగా ఇప్పటి వరకు ఎంత వసూళ్లు వచ్చాయి అనేది వివరంగా చూద్దాం.
ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 13 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 24 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. నాన్ ఫెస్టివల్ సీజన్ లో ఇలా నాన్ స్టాప్ గా 13 రోజులు 1 కోటి కి పైగా షేర్ వసూళ్లు నమోదు అవ్వడం , చరిత్ర లో ఇదే తొలిసారి. రామ్ చరణ్ స్టార్ పవర్ కి ఇదొక శాంపిల్ మాత్రమే. ఇక ప్రాంతాల వారీగా 13 రోజుల్లో వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలించి చూస్తే, నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 52 కోట్ల 44 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ నుండి 20 కోట్ల 17 లక్షలు , ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 21 కోట్ల 77 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 12 కోట్ల 26 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 8 కోట్ల 68 లక్షలు షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా గుంటూరు జిల్లా నుండి 12 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , కృష్ణ జిల్లా నుండి 9 కోట్ల 78 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి 5 కోట్ల 57 లక్షల రూపాయిలు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 142 కోట్ల 83 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 216 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఆంధ్ర/ తెలంగాణ తీసుకుంటే , కర్ణాటక నుండి 14 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 5 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 11 కోట్ల 65 లక్షలు , ఓవర్సీస్ నుండి 22 కోట్ల 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 193 కోట్ల 83 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 326 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ బ్రేక్ ఈవెన్ నెంబర్ ని అందుకోవడానికి మరో 26 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది.
