Salaar: ఎట్టకేలకు ఉత్కంఠకు తెర పడింది. సలార్ విడుదల తేదీకి వచ్చేసింది. దీంతో పలు చిత్రాల నిర్మాతలు ఊపిరి తీసుకున్నారు. సలార్ విడుదల వాయిదా పరిశ్రమలో గందరగోళానికి కారణమైంది. కొన్ని చిత్రాలు విడుదల తేదీ నిర్ణయించుకునేందుకు తికమకపడ్డాయి. ముఖ్యంగా సంక్రాంతి చిత్రాల విడుదల విషయంలో అయోమయం నెలకొంది. ఒకవేళ సలార్ సంక్రాంతికి వస్తే పరిస్థితి ఏంటని నిర్మాతలు ఆందోళనకు గురయ్యారు. తమ చిత్రాన్ని సంక్రాంతికి ప్రకటించాలా లేదా? అనే అయోమయానికి గురయ్యారు.
ఫైనల్ గా సలార్ విడుదల తేదీ వచ్చేసింది. సలార్ క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నారు. నేడు అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 22న సలార్ బాక్సాఫీస్ బరిలో దిగుతుంది. ఈ ఏడాది సలార్ రావడం కష్టమే అంటూ కథనాలు వెలువడగా కాదని రుజువైంది. ఇక ప్రభాస్, షారుఖ్ ల బాక్సాఫీస్ వార్ కి రంగం సిద్ధమైంది. షారుక్ ఖాన్-రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన డంకీ కూడా క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నారు.
రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ మధ్య యుద్ధం ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కానీ నేపథ్యంలో సలార్ విడుదల వాయిదా వేశారు. లేదంటే నేడు ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. క్రిస్మస్ సీజన్ కూడా విడుదలకు మంచిది. సంక్రాంతి చిత్రాలు విడుదలయ్యే వరకు కలెక్షన్స్ దున్నేయవచ్చు. క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ బాగా కలిసి వస్తాయి. ఇక విడుదల తేదీ పోస్టర్ లో ప్రభాస్ లుక్ మైండ్ బ్లాక్ చేస్తుంది. బ్లడ్ బాత్ చేసిన డైనోసార్ లా ఉన్నాడు ప్రభాస్.
పాజిటివ్ టాక్ వస్తే భారీ వసూళ్లు రాబట్టవచ్చు. సలార్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకుడు. ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతి బాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు. కెజిఎఫ్ నిర్మాతలైన హోంబలే పిక్చర్స్ నిర్మిస్తున్నారు. రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు.