https://oktelugu.com/

Peddanna: వర్షంలోనూ ఆగని పెద్దన జోరు.. కలెక్షన్లతో దూసుకెళ్తోన్న తలైవా

Peddanna: సూపర్​స్టార్​ రజనికాంత్​ హీరోగా సిరత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అన్నాత్తై. తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల చేసింది చిత్రబృందం. దీపావళి కానుగా ప్రేక్షకులను పలకరించిన ఈ సినిమా బాక్సాఫీసును బద్దలు కొడుతోంది. ఒక్క ఇండియాలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తోంది. మరోవైపు, తమిళనాడును వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పెద్దన జోరు మాత్రం అసలు తగ్గడం లేదు. గురువారం నాటికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.225 కోట్లు మార్క్​ను దాటేసినట్లు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 19, 2021 / 10:18 AM IST
    Follow us on

    Peddanna: సూపర్​స్టార్​ రజనికాంత్​ హీరోగా సిరత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అన్నాత్తై. తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల చేసింది చిత్రబృందం. దీపావళి కానుగా ప్రేక్షకులను పలకరించిన ఈ సినిమా బాక్సాఫీసును బద్దలు కొడుతోంది. ఒక్క ఇండియాలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తోంది. మరోవైపు, తమిళనాడును వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పెద్దన జోరు మాత్రం అసలు తగ్గడం లేదు. గురువారం నాటికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.225 కోట్లు మార్క్​ను దాటేసినట్లు దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ వారం చివరనాటికి రూ.250కోట్లు మార్క్​ను అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్​ రిపోర్ట్స్​ సూచిస్తున్నాయి.

    peddanna

    దీపావళి నవంబరు 4న ప్రపంచవ్యాప్తంగా 1,000 స్క్రీన్స్​లో విడుదలైంది అన్నాత్తై. సినిమా విడుదలైన తొలిరెండ్రోజులు ప్రతికూల స్పందన లభించింది. అయితే, మెల్లగా ఫ్యామిలీ ఆడియన్స్​ పెద్దన్న సినిమాకు కనెక్ట్​ అయ్యారు. దీంతో, వరుసగా రజనీ సినిమాకు క్యూ కట్టడం ప్రారంభించారు. విడుదలైనప్పటి నుంచి ఒక్క తమిళనాడులోనే రూ.150కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో రజనికాంత్​ హీరో కాగా, కీర్తి సురేశ్​ రజనీ చెల్లెలుగా నటించింది. ఇక మీనా, ఖుష్బు, ప్రకాశ్​ రాజ్​, సూరి, అభిమన్యు సింగ్​, జగపతిబాబు సినిమాలో కీలకపాత్రలు పోషించారు. డి ఇమ్మాన్​ ఈ సినిమాకు సంగీతం అందించారు.

    రోబో తర్వాత పెద్దగా హిట్​ అందుకోని రజనీ.. ఈ సినిమాతో కాస్త ఫర్వాలేదనిపించినట్లు తెలుస్తోంది. అయితే, రోబో2.0 సినిమా రజనీకి పెద్ద దెబ్బ వేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వచ్చిన పెటా, దర్బార్​ వంటి సూపర్​ హిట్​ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే, పెద్దన్నగా రజనీ సత్తా చాటాడనే చెప్పాలి.