https://oktelugu.com/

Pedda Kapu Movie Teaser: యూట్యూబ్ ని ఊపేస్తున్న ‘పెద్ద కాపు’ టీజర్..శ్రీకాంత్ అడ్డాల లో ఇంత మాస్ ఉందా!

మళ్ళీ ఆయన చాలా కాలం తర్వాత విక్టరీ వెంకటేష్ తో 'నారప్ప' అనే చిత్రం చేసాడు, ఈ సినిమా డైరెక్టుగా ఓటీటీ లో విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా 'పెద్ద కాపు' అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. 'అఖండ' లాంటి సంచలన విజయం తర్వాత 'ద్వారకా క్రియేషన్స్' నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా ద్వారా 'విరాట్ కర్ణ' అనే కొత్త హీరో ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : July 3, 2023 / 09:58 AM IST

    Pedda Kapu Movie Teaser

    Follow us on

    Pedda Kapu Movie Teaser: కొంతమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ప్రారంభం లో కొన్ని సూపర్ హిట్ సినిమాలను తీసి తమ టాలెంట్ ని నిరూపించుకున్నా, కేవలం ఒకే ఒక్క ఫ్లాప్ తో కనుమరుగైపోయిన వారు ఇండస్ట్రీ లో చాలామంది ఉన్నారు. అలాంటి డైరెక్టర్స్ లో ఒకరు శ్రీకాంత్ అడ్డాల. ‘కొత్త బంగారు లోకం’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా శ్రీకాంత్ అడ్డాల, తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.

    ఆ చిత్రం తర్వాత ఆయన ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు విక్టరీ వెంకటేష్ ని పెట్టి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి భారీ మల్టీస్టార్ర్ర్ సినిమా తీసాడు. ఈ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో నేటి జెనెరేషన్ లో వచ్చిన మొట్టమొదటి మల్టీస్టార్ర్ర్ ఇదే. కానీ ఈ సినిమా తర్వాత ఆయన మహేష్ బాబు తో చేసిన ‘బ్రహ్మోత్సవం’ అనే చిత్రం అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆ తర్వాత ఇండస్ట్రీ లో కనిపించకుండా పోయాడు శ్రీకాంత్ అడ్డాల.

    మళ్ళీ ఆయన చాలా కాలం తర్వాత విక్టరీ వెంకటేష్ తో ‘నారప్ప’ అనే చిత్రం చేసాడు, ఈ సినిమా డైరెక్టుగా ఓటీటీ లో విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా ‘పెద్ద కాపు’ అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ‘అఖండ’ లాంటి సంచలన విజయం తర్వాత ‘ద్వారకా క్రియేషన్స్’ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా ద్వారా ‘విరాట్ కర్ణ’ అనే కొత్త హీరో ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు.

    ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని నిన్న విడుదల చెయ్యగా దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక పల్లెటూరిలో ఇద్దరు పెద్దలంటారు, ఏ సమస్య వచ్చినా వాళ్ళే దిక్కు, కానీ ఆ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు, గొడవలు జరుగుతూ ఉంటాయి, ఆ తర్వాత జరిగే పరిణామాలే సినిమా అన్నట్టుగా మనకి టీజర్ చూస్తే అర్థం అవుతుంది. మరి ఈ చిత్రం తో శ్రీకాంత్ అడ్డాల బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అనేది చూడాలి.