https://oktelugu.com/

Payal Rajput: మంగళవారం మూవీ హిట్ తో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పాయల్ రాజ్ పుత్…

ఆర్ఎక్స్ 100 సినిమా దర్శకుడు అయిన అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన మంగళవారం సినిమాలో లీడ్ రోల్ పోషించింది. ఇక ఈ సినిమా తో పాయల్ రాజ్ పుత్ మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేయబోయే సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : November 17, 2023 / 12:12 PM IST

    Payal Rajput

    Follow us on

    Payal Rajput: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగులో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందిన పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉంది.

    ఇక ఇప్పుడు ఆర్ఎక్స్ 100 సినిమా దర్శకుడు అయిన అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన మంగళవారం సినిమాలో లీడ్ రోల్ పోషించింది. ఇక ఈ సినిమా తో పాయల్ రాజ్ పుత్ మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేయబోయే సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఈమె ఇంతకు ముందే స్టార్ హీరో అయిన వెంకటేష్ పక్కన వెంకీ మామ సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమాతో ఈమెకి పెద్దగా గుర్తింపు అయితే రాలేదు.

    ఇక దాంతో ఆమెకు పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు కూడా రాలేదు.ఇక ఇవాళ్ళ రిలీజ్ అయిన మంగళవారం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.ఇక ఇప్పుడు aఆమెకి అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో అవకాశం రావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ మంగళ వారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా వచ్చాడు. అక్కడ పాయల్ రాజ్ పుత్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి చాలా రకాల కామెంట్లు కూడా చేసింది ఇక అందులో భాగంగానే ఆమె కి త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబో లో వస్తున్న పాన్ ఇండియా మూవీ లో అవకాశం ఇస్తున్నట్టు గా తెలియజేశారు.

    ఇక దాంతో ఆమెకి ఒకేసారి రెండు విషయాలు సంతోషాన్ని కల్గించాయి. ఒకటి మంగళ వారం మూవీ హిట్ అవ్వడం రెండు త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీలో ఛాన్స్ రావడం ఇక ఈ సినిమాతో ఆమె మరిన్ని భారీ సినిమాలు చేసే దిశగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది… తమిళం లో కూడా ఆమెకి పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు తెలుగు, అటు తమిళ్ రెండు ఇండస్ట్రీల్లో ఆమె వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది…ఇలా ప్రతి నటినటులకు కూడా ఏదో ఒక టైం లో మంచి అవకాశాలు వస్తాయి అప్పటి దాకా మన ప్రయత్నం మనం చేస్తూ ముందుకు వెళ్లాలి…