Homeఎంటర్టైన్మెంట్Manchu Vishnu Movie Update: పాయల్, సన్నీలియోన్ లతో రొమాన్స్ కి రెడీ అయిన మంచు...

Manchu Vishnu Movie Update: పాయల్, సన్నీలియోన్ లతో రొమాన్స్ కి రెడీ అయిన మంచు విష్ణు !

Manchu Vishnu Movie Update: పాపం మా అధ్యక్షుడు అయ్యాక, సినీ నటుడు మంచు విష్ణు టైం అస్సలు బాగాలేదు. అంతకు ముందు జగన్ తో మీటింగ్ విషయంలో పేర్ని నాని చేతిలో అవమాన పడ్డాడు. అలాగే గత వారం నుంచి హెయిర్‌ డ్రెసర్‌ నాగ శ్రీనుతో వివాదం నడుస్తోంది. అందుకే.. వీటన్నిటిని త్వరగా జనం మర్చిపోవాలని విష్ణు తన కొత్త సినిమాల విశేషాలను వరుసగా వదులుతున్నాడు.

కాగా మంచు విష్ణు హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘గాలి నాగేశ్వరరావు’. టైటిల్ ను బట్టే ఈ సినిమా ఒక కామెడీ సినిమా అని అర్ధం అయిపోతుంది. కాగా విష్ణు లీడ్ రోల్ లో రాబోతున్న ఈ చిత్రంలో స్వాతి పాత్రలో పాయల్ రాజ్ ఫుత్, రేణుక గా సన్నీలియోన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఇద్దరూ సినిమాలో భాగమైన విషయాన్ని చిత్రం యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Manchu Vishnu Movie Update
Gali Nageswarao

‘గాలి నాగేశ్వరరావు’ క్యారెక్టర్ ని కార్టూన్ రూపంలో విడుదల చేసినట్టే… పాయల్, సన్నీలియోన్ గెటప్ లను కూడా కార్టూన్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. మొత్తానికి విష్ణుకి హీరోయిన్స్ గా అదిరిపోయే బోల్డ్ భామలను తీసుకున్నారు. కాగా డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Also Read: Shruti Haasan: మనం మనతో నిజాయితీగా ఉండాలి – శృతి హాసన్

కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించాడట.

Also Read: Radhe Shyam Movie Review: ‘రాధేశ్యామ్’ రివ్యూ : సినిమాలో మెయిన్ హైలైట్స్ ఇవే

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version