Rashmika Mandanna Remuneration: రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వాస్తవంగా ఈమె చాలా లక్కీ హీరోయిన్ అని చెప్పు కోవాలి. ఎందుకంటే ఈమె పట్టిందల్లా బంగారమే అన్నట్టు చేసిన ప్రతి సినిమా కూడా దాదాపు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో ఆమె రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రెమ్యూనరేషన్ కూడా విపరీతంగా పెంచేసింది ఈ హాట్ బ్యూటీ. తన తొలి సినిమా ఛలో కు రూ.25 లక్షలు తీసుకున్న ఈ భామ.. ఇప్పుడు తన రెమ్యునరేషన్‌ను అంతకు పన్నెండు రెట్లు పెంచేసింది.
సౌత్ లో అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్న రష్మిక.. కొన్నిసార్లు రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తే హీరో ఎవరు, కథ ఏంటి అని కూడా ఆలోచించకుండా రాంగ్ స్టెప్ తీసుకుంటుందట. ఇందుకు ఉదాహరణ తాజాగా విడుదలైన ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ అని చెబుతున్నారు. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న రష్మిక.. శర్వానంద్ లాంటి ఆవరేజ్ హీరోతో నటించడానికి రెడీ అయిపోయింది. పైగా శర్వా వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు.
Also Read: ‘అఖిల్’ కోసం మెగాస్టారే దిగాడు.. వర్కౌట్ అవుతుందా ?
ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. సినిమా సీరియల్ లాగా ఉందని, రొటీన్ కథ తో బోర్ కొట్టించారు అంటూ నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది. దీంతో రష్మిక ఈ ఏడాది పెద్ద ప్లాప్ ను మూటగట్టుకుంది. పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్ తో గతేడాదికి ముగింపు పలికిన రష్మిక.. ఈ ఏడాదిలో మాత్రం ప్లాప్ మూవీతో స్టార్ట్ చేసింది. ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీకి కలెక్షన్లు కూడా దారుణంగా పడిపోయాయి.
అయితే ఈ మూవీని రష్మిక రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తున్నారనే కారణంతోనే ఒప్పుకుందట. వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో ఉన్న రష్మిక.. అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేసరికి కథ ఏంటి అని కూడా చూడకుండా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు సినీ విమర్శకులు. చివరకు ఇలా ప్లాట్ మూవీ ని ఆమె ఖాతాలో వేసుకుంది.