https://oktelugu.com/

‘మహా సముద్రం’లో బోల్డ్ బ్యూటీ !

బోల్డ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి ‘మహా సముద్రం’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఈ సాంగ్ లో హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటించబోతుందని తెలుస్తోంది. యువ హీరోల్లో మంచి టాలెంట్ ఉన్న హీరో శర్వానంద్ హీరోగా ఈ సినిమా రాబోతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ మూస కథల్ని పట్టుకుని వేలాడకుండా వైవిధ్యమైన సినిమాలు, నటనకు ఆస్కారమున్న కథలు చేస్తూ తనకంటూ ప్రత్యేక […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 25, 2021 / 10:11 AM IST
    Follow us on


    బోల్డ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి ‘మహా సముద్రం’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఈ సాంగ్ లో హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటించబోతుందని తెలుస్తోంది. యువ హీరోల్లో మంచి టాలెంట్ ఉన్న హీరో శర్వానంద్ హీరోగా ఈ సినిమా రాబోతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ మూస కథల్ని పట్టుకుని వేలాడకుండా వైవిధ్యమైన సినిమాలు, నటనకు ఆస్కారమున్న కథలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్. ఇక ఈ సినిమాలో శ‌ర్వానంద్ కి జ‌త‌గా అదితి రావు హైదరి నటించబోతుంది.

    Also Read: నిహారిక నాతో ఇంతకు ముందులా మాట్లాడట్లేదు: నాగబాబు

    కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. అలాగే ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలకు వస్తే.. సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి తదితరులు నటిస్తున్నారు.

    Also Read: తనకు ప్రాణ హాని ఉందంటున్న అర్జున్ రెడ్డి నటి

    అన్నట్టు శర్వా ట్రాక్ మార్చాడు. అటు కుటుంబ ప్రేక్షకులను ఇటు యువతను ఆకట్టుకునే విధంగా సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం ఆయన కిశోర్ బి డైరెక్షన్లో చేస్తున్న ‘శ్రీకారం’ చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే శర్వా గత చిత్రం ‘శతమానంభవతి’ తరహాలో ఈ సినిమా ఉండనుంది. అలాగే తన 30వ సినిమాను శ్రీకార్తీక్ దర్వకత్వంలో చేస్తున్నాడు. ఇది తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం. త్వరలోనే చిత్రం పూర్తికానుంది. దీని తర్వాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ చిత్రం చేయనున్నాడు. ఇది పూర్తిగా ఫన్ ఎంటర్టైనర్.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్