
బొయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తాజా చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. పోలీస్ అధికారి పాత్రతోపాటు ఫ్లాష్ బ్యాక్ లో అఘెరా కనిపించనున్నాడు. బాలయ్య సరసన ఇద్దరు భామలు ఆడిపాడనున్నారు. ఒక హీరోయిన్ గా అంజలి ఎంపికైంది. మరో హీరోయిన్ గా ఆర్ఎక్స్-100 భామ పాయల్ రాజ్ పుత్ ఎంపికైనట్లు ప్రచారం జరిగింది.
దీనిపై పాయల్ రాజ్ ఫుత్ ట్వీటర్లో స్పందించారు. బాలయ్య మూవీ కోసం తాను ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదని.. బాలయ్య మూవీలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు గాసిప్స్ అంటూ ట్వీటర్లో ట్వీట్ చేసింది. దీంతో పాయల్ ఈ మూవీలో నటించడం లేదని తెలుస్తోంది. దీంతో బాలయ్య పక్కన నటించే మరో ఎవరనేది ఆసక్తిగా మారింది.
‘ఆర్‌ఎక్స్-100’ మూవీతో పాయల్ తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇటీవల రవితేజతో కలిసి ‘డిస్కోరాజా’, విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘వెంకీమామ’లో నటించి మెప్పించింది.గతంలో బాలకృష్ణ నటించిన ‘కథానాయకుడు’ మూవీలో పాయల్ నటించింది. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. ప్రస్తుతం పాయల్ రాజ్ ఫుత్ ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుంది.