
క్యాస్టింగ్ కౌచ్.. నెపోటిజమ్.. మీటూలో తామూ బాధితులమేనంటూ ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మీడియా ముందుకొచ్చారు. బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్‌వుడ్ ఎందులోనైనా మీటూకు బాధితులు ఉన్నారు. రీసెంట్‌గా ఊసరవెల్లి సినిమాలో నటించిన హీరోయిన్ పాయల్ ఘోష్ కూడా ఓ దర్శకుడి బండారం బయటపెట్టింది.
Also Read: డ్రగ్ కేసులో రకుల్ పేరు వైరల్.. నవదీప్ కౌంటర్
మంచు మనోజ్ ప్రయాణం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పాయల్ ఘోష్. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ఊసరవెల్లిలో సెకండ్ హీరోయిన్‌గా వచ్చింది. ఆ సినిమాలో తమన్నాతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే రీసెంట్‌గా సినిమా ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి కూడా ఈ బ్యూటీ వివరణ ఇచ్చింది.
పాయల్ మాట్లాడుతూ.. ‘నేను గతంలో ఒక దర్శకుడిని కలిశాను. కథా చర్చల కోసం పిలిచారేమో అని అతని ఇంటికి వెళ్లాను. మొదట్లో నన్ను గారాభం చేశారు. ఆ తరువాత మెల్లగా అతను వ్యవహరిస్తున్న తీరు మాట్లాడే విధానంపై నాకు అనుమానం వచ్చింది. ఇంట్లో ఉన్న స్పెషల్ గదికి తీసుకెళ్లి కొంత అసభ్యంగా మాట్లాడాడు. తన గదిలోనే ఒక బ్లూ ఫిల్మ్ చూపించే ప్రయత్నం చేశాడు. అలాగే తన దగ్గరకు ఏ హీరోయిన్ వచ్చినా కూడా ఈ గదిలోనే ఎంజాయ్ చేస్తుంటారని చెప్పాడు. అతని పద్ధతిపై అప్పుడు నాకు చాలా కోపంగా అనిపించింది. వెంటనే నాకు ఆరోగ్యం అంతగా బాగోలేదనే సాకుతో అక్కడి నుంచి తప్పించుకున్నాను. మరోసారి అతనిని కలవలేదు..’ అని పాయల్ వివరణ ఇచ్చింది.
Also Read:తండ్రీకొడుకులుగా మహేష్ బాబు..!
దాంతోపాటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి మాట్లాడిన పాయల్ ‘అతను నాకు చాలా మంచి స్నేహితుడు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఇక డ్రగ్స్ తీసుకుంటే చలాకీగా ఉంటారనేది పూర్తిగా అవాస్తవం. డ్రగ్స్ వాడకం మంచిది కాదు’ అంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. ఇక గతంలో ఒక క్రికెటర్‌తో బ్రేకప్ తనను ఎంతగానో బాధించినట్లు పాయల్ తెలిపింది.