రాజకీయాల్లో ఒకరిపై ఒకరు వేసుకునే సెటైర్లు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని.. ఆనందాన్ని కలిగిస్తుంటాయి. అందులోనూ దశాబ్దాలుగా రాజకీయంలో ఉన్న చంద్రబాబుపై, అతని కొడుకు లోకేష్‌పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసే సెటైర్లు కేక పుట్టిస్తుంటాయి. నిత్యం వారిని ఏదో ఒక విధంగా ర్యాగింగ్ చేస్తూనే ఉంటారు. గత ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి అక్రమాలు, వ్యవహారాలతోపాటు, ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిణామాల దగ్గర నుంచి వేటినీ వదిలిపెట్టకుండా, అన్నింటినీ వాడేస్తుంటారు.
Also Read: ఆ ఎంపీలు ఎందుకు సైలెంటయ్యారు..
‘తండ్రీ కొడుకులు తప్పి పోయారని, వారిని బలవంతంగా వ్యాన్ ఎక్కించి మా రాష్ట్రానికి పంపించండి’ అంటూ వ్యంగ్యంగా అస్త్రాలు సంధించడం ఒక్క విజయసాయిరెడ్డికే చెల్లింది. మరో సందర్భంలో టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కొంతమంది టీడీపీ నాయకులను ఉద్దేశించి.. ‘ఏడాది కాలంగా తినడానికి ఏమీ లేని టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోంది. ఇప్పటికే ఆ మిడతలు మీ పార్టీలో చేరి విధ్వంసం సృష్టించిన విషయం గ్రహించే లోగానే మిగతావి ఎగురుకుంటూ బయలుదేరాయి’ అంటూ విమర్శించడం విజయసాయిరెడ్డికే చెల్లింది.
ఇలా సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, చంద్రబాబు, లోకేష్‌లను ఆడుకోవడం ఒక్కటే తమ ప్రధాన విధి అన్నట్టు సైరా పంచ్‌లతో దూసుకెళ్తున్నారు. ఆ పంచ్‌లు కూడా తండ్రి కొడుకులు ఇట్టే పేలిపోతున్నాయి. ఇప్పుడు అమరావతి వ్యవహారం పైనా అంతే స్థాయిలో లోకేష్ , చంద్రబాబుపై విమర్శలు సందిస్తున్నాడు విజయసాయిరెడ్డి.
Also Read: సడన్ గా బాబు ఆ రాగం ఎందుకు ఎత్తుకున్నాడు?
చంద్రబాబు, లోకేష్ పార్టీ పైన కానీ, జగన్ పై కానీ విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు చేసేందుకు ముందుగా విజయసాయిరెడ్డి తెరపైకి వస్తున్నారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా, వైసీపీలో విజయసాయిరెడ్డికి ఓ ప్రత్యేకత ఉండడంతో ఆయన విమర్శలు ఇంతగా హైలెట్ అవుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న సోషల్ మీడియా ట్రెండ్‌ను చక్కగా వాడుకోవడంలోనూ విజయసాయిరెడ్డి ఆయనకు ఆయనే సాటి. తనదైన శైలిలో పంచ్ డైలాగులు పేల్చుతూ, తండ్రి కొడుకులు ఇద్దరిని తిట్టిపోస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. మొన్నటి వరకు కరోనా వైరస్ కారణంగా హైదరాబాద్‌కే పరిమితమైన తీరుపై వ్యంగ్యంగా విమర్శలు చేశారు.