https://oktelugu.com/

Bheemla Nayak Dialogues: భీమ్లా నాయక్‌ లో ఆ డైలాగ్‌ జగన్‌ ని ఉద్దేశించి పెట్టారట

Bheemla Nayak Dialogues: భీమ్లా నాయక్‌ అభిమానుల కేరింతల మధ్య హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఊహించినంత బ్లాక్‌బస్టర్‌ రేంజ్‌లో లేదనే చెప్పాలి. మాతృక అయ్యప్పనుమ్‌ ఖోషియుమ్‌ చూసినవారికి భీమ్లా అంతగా నచ్చదు. మాతృకలో కమర్షియల్‌ అంశాలను ఫాలో అవుతూనే వాస్తవికతను చూపెడితే, ఇందులో రియాలిటీని పక్కనపెట్టి కేవలం సినిమాటిక్‌ లిబర్టీని మాత్రమే వాడుకున్నారు. అయినా మరోపక్క భీమ్లా నాయక్‌ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇంకా మొదటి రెండో రోజు పూర్తే కాలేదు, అప్పుడే అమెరికాలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 26, 2022 / 12:10 PM IST
    Follow us on

    Bheemla Nayak Dialogues: భీమ్లా నాయక్‌ అభిమానుల కేరింతల మధ్య హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఊహించినంత బ్లాక్‌బస్టర్‌ రేంజ్‌లో లేదనే చెప్పాలి. మాతృక అయ్యప్పనుమ్‌ ఖోషియుమ్‌ చూసినవారికి భీమ్లా అంతగా నచ్చదు. మాతృకలో కమర్షియల్‌ అంశాలను ఫాలో అవుతూనే వాస్తవికతను చూపెడితే, ఇందులో రియాలిటీని పక్కనపెట్టి కేవలం సినిమాటిక్‌ లిబర్టీని మాత్రమే వాడుకున్నారు.

    CM JAGAN, PAWAN

    అయినా మరోపక్క భీమ్లా నాయక్‌ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇంకా మొదటి రెండో రోజు పూర్తే కాలేదు, అప్పుడే అమెరికాలో 2 మిలియన్‌ మార్కుని చేరుకుంది. యూఎస్‌ ప్రీమియర్స్‌లో ఆల్‌టైమ్‌ టాప్‌-10 లిస్ట్‌లో భీమ్లా చేరిందంటే ఏ రేంజ్‌లో అభిమానులు ఎగబడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఈక్రమంలో నిర్మాత నాగవంశీ, త్రివిక్రమ్‌, చిత్ర బృందం కలిసి కేక్‌ కట్‌ చేసి, ‘ఈసారి గట్టిగా కొట్టాం’ అని విజయోత్సవ వేడుకలు జరిపారు.

    Also Read:   “భీమ్లా నాయక్” పై సినీ ప్రముఖుల ప్రసంసల వర్షం

    ఏది ఏమైనా పవన్‌ అభిమానుల జోరు మధ్య టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ హోరు పెడుతోంది. ఈక్రమంలో సినీ పరిశ్రమ నుండి భీమ్లా నాయక్‌ బృందానికి వెల్లువలా శుభాకాంక్షలు అందుతున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్‌ చిరు, తమ్ముడికి శుభాభినందనలు తెలియజేశారు. ఈ చిత్రం ట్రూ పవర్‌ స్టార్మ్‌ (తుఫాను) కి నిదర్శనమని పవన్‌, రానాతో కలిసి తాను దిగిన ఫొటో ట్విట్టర్‌లో షేర్‌ చేసి తెలిపారు. కాగా ఏప్రిల్‌ నుండి ఆచార్య జాతర మొదలు కానుంది.

    Bheemla Nayak

    ప్రస్తుతం భీమ్లా నాయక్‌ చిత్రాన్ని చూసిన వారు, అందులోని ‘శుక్రవారం సంతకం’ డైలాగ్‌ గురించే చర్చిస్తున్నారు. రావు రమేష్‌, రానాల పాత్రల ద్వారా స్టేషన్‌లో సంతకం గురించి సాధ్యమైనంత సెటైర్లు జోడించారు. ఈ డైలాగ్‌కి అభిమానుల నుండి కేరింతలు లభించాయి. దీన్ని కావాలనే జగన్‌ని ఉద్దేశించి పెట్టారని అంటున్నారు.

    Also Read:  ‘భీమ్లా నాయక్’ ఏపీ & తెలంగాణ సెకండ్ డే కలెక్షన్స్

    Tags