https://oktelugu.com/

Pawan: నా భార్యకు విడాకులు ఇచ్చి చాలా కాలం అవుతుంది… పవన్ షాకింగ్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్

ముఖ్యంగా సెలెబ్స్ విడాకులు తీసుకోవడం ఓ ఫ్యాషన్ గా భావిస్తున్నారు. అసలు ఎలాంటి గొడవలు లేకున్నా జస్ట్ చేంజ్ కోసం విడాకులు తీసుకునే భార్య భర్తలు కూడా ఈ సమాజంలో ఉన్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : April 23, 2024 6:32 pm
    Pawan Sai Instagram Post Goes Viral

    Pawan Sai Instagram Post Goes Viral

    Follow us on

    Pawan: ఈ మధ్య వైవాహిక బంధాలు మరింత బలహీనంగా మారాయి. చిన్న చిన్న కారణాలకు కూడా విడాకులు తీసుకునే జంటల సంఖ్య ఎక్కువై పోయింది. ఒకప్పుడు విడాకులు అంటే అదో పెద్ద నేరంగా సమాజం చూసేది. భార్య భర్తలు చాలా వరకు సర్దుకుపోయేవారు. విబేధాలు తలెత్తినా పెద్దలు పరిష్కరించేవారు. సామాజిక సమీకరణాలు మారిపోయాయి. మనుషుల ఆలోచనా విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సెలెబ్స్ విడాకులు తీసుకోవడం ఓ ఫ్యాషన్ గా భావిస్తున్నారు. అసలు ఎలాంటి గొడవలు లేకున్నా జస్ట్ చేంజ్ కోసం విడాకులు తీసుకునే భార్య భర్తలు కూడా ఈ సమాజంలో ఉన్నారు.

    తాజాగా నటుడు పవన్ సాయి విడాకుల ప్రకటన చేశాడు. తాను భార్యతో విడిపోయి చాలా కాలం అవుతుందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ముద్దమందారం ఫేమ్ పవన్ సాయి ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో… అందరికీ హాయ్.. నా వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. నాకు ఏదో సామెత గుర్తుకు వచ్చింది. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయట.

    నేను నా భార్య మధుతో విడిపోయి ఆరు నెలలు అవుతుంది. పరస్పర అంగీకారంతో మేము విడాకులు తీసుకున్నాము. మేము ఎప్పటికీ ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటాము. నా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులకు నేను చెప్పేది ఏంటంటే… నేను నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి విషయాలు పబ్లిక్ లో పెట్టడానికి ఇష్టపడను. అందుకే చెప్పలేదు.

    ఇక నా పై గాసిప్స్ రాసే వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ కి నేను చెప్పేది ఏంటంటే… ఇలాంటి గాసిప్స్ రాయకపోతే మీకు సంపాదన ఉండదు. మీకు ఇంత కంటే క్రేజీ స్టఫ్ నేను ఇస్తాను. నాకు కాల్ చేయండి. అలా రాసిన వార్తలతో వచ్చిన డబ్బులతో మీ కుటుంబ సభ్యులకు కడుపునిండా భోజనం పెట్టండి.. అని రాసుకొచ్చాడు. పవన్ సాయి సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ముద్దమందారం, మల్లీ సీరియల్స్ లో పవన్ సాయి లీడ్ రోల్ చేశాడు.