https://oktelugu.com/

పేరుకే విడాకులు, బంధం బలంగానే కొనసాగుతుందా?

పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేశారు పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్. తరువాత తీరికగా పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్నేళ్లలోనే విడిపోయారు. పరస్పర ఒప్పందంతో విడిపోయినట్లు పవన్, రేణూ మొదట్లో చెప్పారు. విడాకుల తర్వాత పిల్లలతో రేణూ పూణేలో సెటిలయ్యారు. అయితే వీలు దొరికినప్పుడల్లా పవన్ కి షాకిస్తూ ఉండేది రేణూ. అనేక మార్లు పవన్ వలన చాలా కోల్పోయినట్లు ఆమె చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా నష్టపోయానని రేణూ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను పెంచడానికి […]

Written By:
  • admin
  • , Updated On : December 3, 2020 / 02:11 PM IST
    Follow us on


    పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేశారు పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్. తరువాత తీరికగా పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్నేళ్లలోనే విడిపోయారు. పరస్పర ఒప్పందంతో విడిపోయినట్లు పవన్, రేణూ మొదట్లో చెప్పారు. విడాకుల తర్వాత పిల్లలతో రేణూ పూణేలో సెటిలయ్యారు. అయితే వీలు దొరికినప్పుడల్లా పవన్ కి షాకిస్తూ ఉండేది రేణూ. అనేక మార్లు పవన్ వలన చాలా కోల్పోయినట్లు ఆమె చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా నష్టపోయానని రేణూ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను పెంచడానికి ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, పవన్ నుండి ఒక్క రూపాయి కూడా తనకు చెందలేదని చెప్పారు.

    Also Read: బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనే?

    రేణూ స్టేట్మెంట్స్ పవన్ తో పాటు ఆయన వీరాభిమానులకు చురుకు పుట్టించేవి. పవన్ రేణూ ఆరోపణలపై నోరుమెదపక పోయినా…ఆ బాధ్యత పవన్ ఫ్యాన్స్ తీసుకునేవారు. ఆమెను తీవ్రంగా దుర్భాషలాడడంతో పాటు సోషల్ మీడియా వేధింపులకు గురిచేసే వారు. రేణూ రెండో పెళ్లి నిర్ణయాన్ని కూడా పవన్ ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె పెళ్లి చేసుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం రేణూను మరింత వేదనకు గురిచేసింది. అనేక ఇంటర్వ్యూలలో పవన్ అంటే తనకు గిట్టదు అన్నట్లు ఆమె విమర్శల దాడి ఉండేది.

    మనుషుల నిర్ణయాలు, కోపాలు ఎప్పుడూ ఒకలా ఉండవు. రేణూ కూడా పవన్ పై కోపం, ద్వేషం వదిలేశారా అనే సందేహం కలుగుతుంది. నిన్న సడన్ గా పిల్లలు ఆద్య, అకీరాలు పవన్ ఒడిలో సేదతీరుతున్న ఫొటో సోషల్ మీడియాలో పంచుకుంది రేణూ. పిల్లలతో ఆప్యాయంగా గడుపుతున్న పవన్ ఫోటోను ఆమె అద్భుత క్షణంగా వర్ణించారు. ఒకప్పుడు ఆద్య, అకీరా పవన్ పిల్లలు అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడిన రేణూలో ఈ మార్పుకు కారణం ఏమిటో తెలియడం లేదు.

    Also Read: బిగ్ బాస్ : అరియానా ఎమోషన్ మాములుగా లేదుగా !

    ఈ నేపథ్యంలో రేణూ దేశాయ్ మనసు మార్చుకొని పవన్ కి దగ్గరయ్యారా అనే సందేహం కలుగుతుంది. అధికారికంగా విడాకులు తీసుకున్నా, వీరి బంధం కొనసాగుతుందనే సందేహం కలుగుతుంది. ఇటీవల బద్రి 20ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని, రేణూ పవన్ తో అప్పటి మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది. ఈ విషయంలో రేణూను పవన్ ఫ్యాన్స్ వ్యతిరేకించగా, అది నా మొదటి చిత్రం అందుకే అప్పటి ఫోటోలు షేర్ చేశానని సమర్ధించుకున్నారు. వరుస పరిణామాలు చూస్తుంటే, పవన్-రేణూ సన్నిహితంగానే ఉంటున్నారన్న సందేహం కలుగుతుంది. అందుకే రేణూ పూణే నుండి హైదరాబాద్ కి మకాం మార్చారు అంటున్నారు.

    మరో వైపు రేణూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆద్య అనే వెబ్ సిరీస్ లో సాఫ్ట్వేర్ కంపెనీ యజమానిగా నటిస్తున్నారు. అలాగే ఓ చిత్రానికి దర్శకత్వం వహించారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్