Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే “ఆడవాళ్లు మీకు జోహార్లు” మూవీ సక్సక్స్ మీట్ లో హీరోయిన్ రష్మిక మందనా తాజాగా తన పెళ్లిపై రష్మిక సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు నచ్చిన వాడితోనే కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తారని స్పష్టం చేశారు. ఆమె నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను మహిళలు పెద్ద సంఖ్యలో ఆదరిస్తున్నారని తెలిపింది.

మొత్తానికి ఈ క్రేజీ హీరోయిన్ పెళ్లి టాపిక్ మళ్ళీ వైరల్ అవుతుంది. ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పైగా ఆమెకు మంచి విజయాలు కూడా వస్తున్నాయి. దాంతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మరి సడెన్ గా పెళ్లి టాపిక్ ఎందుకు వచ్చింది అంటే.. ? 2022లో రష్మిక మందన్నా ఏ సినిమాలు చేస్తోందో క్లారిటీ లేదు. పైగా ఈ ఏడాది ఇప్పటివరకు ‘రష్మిక మందన్నా’ మరో తెలుగు సినిమా ఒప్పుకోలేదు. ఇంకా రష్మిక మందన్నా ఏ తెలుగు సినిమా సైన్ చెయ్యలేదు కాబట్టి.. బహుశా ఆమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ గాసిప్ రాయుళ్లు పుకార్లు పుట్టించారు.
Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్ !
దాంతో తాజాగా ఈ బ్యూటీ తన పెళ్లి గురించి తన మనసులో మాటని బయట పెడుతూ అందరికీ క్లారిటీ ఇచ్చింది. తనకు 30 ఏళ్ళు దాటిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అంటూ రష్మిక మందన్నా చెప్పుకొచ్చింది. అయితే, తాను ప్రస్తుతం తెలుగు సినిమాలను కొత్తగా అంగీకరించక పోవడానికి ప్రధాన కారణం హిందీ సినిమాలతో బిజీగా ఉండటమేనట.
ఇక రష్మిక మందన్నాకి 25 ఏళ్ళు. అంటే రష్మిక మందన్నా లెక్క ప్రకారం ఇంకో మరో ఐదేళ్ల తర్వాత ఆమె తన పెళ్లి గురించి ఆలోచిస్తుంది అన్నమాట. ఏది ఏమైనా రష్మిక మందన్నా వ్యక్తిత్వం చిన్న పిల్లలా ఉంటుందని టాక్ ఉంది.
[…] […]