https://oktelugu.com/

కరోనా దెబ్బతో ఓటీటీలోకి ‘వకీల్ సాబ్’ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ 100 శాతం ఆక్యుపెన్సీతో రికార్డుల మోత మోగించాడు. ఆశ్చర్యకరంగా ప్రీమియర్ షోల నుండే ‘వకీల్ సాబ్’ కలెక్షన్స్ సునామీలా వచ్చాయి. ఆ రేంజ్ కలెక్షన్స్ దిల్ రాజు టీమ్ కూడా ఊహించలేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానాలు గర్వంగా సగర్వంగా చాటి చెప్పుకునేలా వకీల్ సాబ్ కి రిటర్న్ వచ్చింది. అయితే ఆ తరువాత వారం నుండి కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం ఎక్కువుగా కనిపించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ […]

Written By:
  • admin
  • , Updated On : April 27, 2021 / 06:24 PM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ 100 శాతం ఆక్యుపెన్సీతో రికార్డుల మోత మోగించాడు. ఆశ్చర్యకరంగా ప్రీమియర్ షోల నుండే ‘వకీల్ సాబ్’ కలెక్షన్స్ సునామీలా వచ్చాయి. ఆ రేంజ్ కలెక్షన్స్ దిల్ రాజు టీమ్ కూడా ఊహించలేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానాలు గర్వంగా సగర్వంగా చాటి చెప్పుకునేలా వకీల్ సాబ్ కి రిటర్న్ వచ్చింది.

    అయితే ఆ తరువాత వారం నుండి కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం ఎక్కువుగా కనిపించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా థియేటర్స్ లో సినిమా చూడటానికి ఇంట్రస్ట్ చూపించలేదు. దాంతో సినిమా చూడని వారంతా, ఈ సినిమా ఓటిటీ ప్లాట్ ఫామ్ లోకి ఎప్పడు వస్తోందా ? సినిమా ఎప్పడు చూద్దామా అంటూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

    వారి ఎదురుచూపులకు క్లారిటీ వచ్చింది. భారీ మొత్తానికి ‘వకీల్ సాబ్’ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది అమెజాన్ ప్రైమ్. కాగా తాజాగా సినిమాని రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. ప్రస్తుతానికి థియేటర్లలో సినిమా లేదు కాబట్టి, నిర్మాత దిల్ రాజే స్వయంగా అమెజాన్ వారికి ఫోన్ చేసి మరీ, ఓటీటీ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    దాంతో ఈ నెల 30 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో వకీల్ సాబ్ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు ఇప్పటికే స్పెషల్‌ ప్రోమోను కూడా రిలీజ్‌ చేయడం జరిగింది. ఎలాగూ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ లో చాలావరకూ థియేటర్లలో చూడలేదు కాబట్టి.. కచ్చితంగా ఓటీటీలో చూస్తారు. అలాగే పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన కథానాయకుడి సినిమాని మళ్ళీ చూడటానికి ఆసక్తి చూపిస్తారు.

    ఈ లెక్కలన్నీ పరిగణలోకి తీసుకుని సరిచూసుకుంటే.. వకీల్ సాబ్ ఓటీటీలో కూడా ప్రభంజనం సృష్టించడం గ్యారంటీ. మరోపక్క ఈ సినిమా పై అమెజాన్ ప్రైమ్ కూడా భారీగానే ఖర్చు పెట్టింది. వారికీ గిట్టుబాటు అవ్వాలంటే.. రెగ్యులర్ సినిమాలకు వచ్చే వ్యూస్ కంటే రెట్టింపు వ్యూస్ రావాలి. పవన్ సినిమా కాబట్టి వచ్చే అవకాశం కూడా ఉంది.