Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో నటించి మెప్పించడమే కాకుండా మెగా ఫ్యామిలీ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక తన నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇద్దరు కూడా స్టార్ హీరోలుగా మారడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో తనదైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు చేస్తూనే ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కూడా కొనసాగిస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ సినిమాలకు మంచి గుర్తింపైతే ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో పెను రికార్డులను సృష్టించాయి…ఇక నిన్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రావడం మనం చూశాం…
మరి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ మీద తన ప్రేమను చూపించడమే కాకుండా మెగా ఫ్యామిలీ అంటే ఏంటో మరోసారి జనానికి తెలిసేలా చెప్పాడు. మరి ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక రామ్ చరణ్ సైతం గ్లోబల్ స్టార్ గా అవతరించి ముందుకు దూసుకెళ్తున్నాడు.
కాబట్టి ఆయన్ని మనందరం ఆశీర్వదించాలని పవన్ కళ్యాణ్ కోరుకోవడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ నటించిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన కొన్ని సినిమాలు ఏంటి అనే ప్రస్తావన అయితే ప్రతిసారి వస్తుంది. మరి ఎప్పటికప్పుడు ఈ విషయానికి సంబంధించిన టాపిక్ వస్తున్నప్పటికి రామ్ చరణ్ నటించిన సినిమాల్లో మగధీర, రంగస్థలం సినిమాలు అంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమని తెలిస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ రెండు సినిమాలంటే అంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమనే విషయం ప్రతి సారీ ప్రూవ్ అవుతునే వస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ గురించి మాట్లాడాల్సి వచ్చిన ప్రతిసారి ఈ సినిమాల ప్రస్తావన తీసుకు వస్తు మాట్లాడుతూ ఉంటాడు…
ఇక రీసెంట్ గా గేమ్ చేంజర్ ఈవెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ రంగస్థలం సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమాలో చరణ్ చాలా బాగా నటించాడు ఆయన నటనకి పెద్ద అవార్డు రావాలి. కానీ రాలేదు అంటూ కొన్ని ఘాటు వ్యాఖ్యలైతే చేశాడు. మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టం అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తి రామ్ చరణ్ గురించి చెప్పడం విశేషం…