Pawan Kalyan New Movie: టాలీవుడ్ లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోరు ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..రీ ఎంట్రీ తర్వాత ఆయన చేసిన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ ఈ రెండు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఆయన అభిమానుల ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు..ఒకపక్క రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతూనే మరోపక్క సినిమాలు చేస్తూ రాణించడం అతి తక్కువ మందిని మాత్రమే మనం చూసి ఉంటాము..ఆ అతి తక్కువ మందిలో ఒకరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..గత కొంత కాలం నుండి తాత్కాలిక విరామం తీసుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 17 వ తారీకు నుండి సెట్స్ మీదకి వెళ్లనుంది..దీనికి సంబంధించిన వర్క్ షాప్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యింది..దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో సోషల్ మీడియా లో విడుదల చెయ్యగా , అందులో అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న పవన్ కళ్యాణ్ లుక్ ప్రస్తుతం ఎలా ట్రెండ్ అవుతుందో మన అందరికి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం పూర్తి స్థాయి లో శ్రద్ద చూపిస్తూ ఎంతో చురుగ్గా ఉండడం చూసి అభిమానులు ఖుషి రోజులను గుర్తు చేసుకొని మురిసిపోతున్నారు..అక్టోబర్ 17 వ తారీకు నుండి జరగబొయ్యే షెడ్యూల్ సుమారు 30 రోజులు ఉండబోతున్నట్టు సమాచారం..ఒక పక్క ఈ సినిమా చేస్తూనే మరోపక్క ఇంకో సినిమా కి ముహూర్తం ప్లాన్ చేసాడు మన పవర్ స్టార్..ప్రభాస్ తో సాహూ వంటి భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాని చేసిన ప్రముఖ డైరెక్టర్ సుజీత్ తో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయబోతున్నాడని గత కొంత కాలం నుండి వార్తలు వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే.

ఈ సినిమాని #RRR నిర్మాత డీవీవీ దానయ్య గారు నిర్మించబోతున్నాడు..ఈ అక్టోబర్ 5 వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు ప్రారంభం కానుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద వీరాభిమాని అనేది మన అందరికి తెలిసిందే..ఒక అభిమాని మనసు పెట్టి సినిమా తీస్తే ఎలా ఉంటుందో మనం గబ్బర్ సింగ్ సినిమా ద్వారా చూసాము..ఇప్పుడు మళ్ళీ మరో వీరాభిమాని పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తే ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరే ఊహించుకోండి అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.