Pawan Kalyan Latest Looks: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ న్యూస్ బయటకి వచ్చిన సోషల్ మీడియా ఎలా ఊగిపోతుందో మన అందరికి తెలిసిందే..ఆయనకి ఉన్న విపరీతమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి..ఈరోజు పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్ తో దర్శనమిచ్చి అభిమానులను మరియు ప్రేక్షకులను షాక్ కి గురి చేసారు..’హరి హర వీరమల్లు’ తాజా షెడ్యూల్ అక్టోబర్ 17 వ తారీకు నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన భారీ సెట్స్ లో జరగబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ షెడ్యూల్ కి సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్ కోసం పవన్ కళ్యాణ్ నేడు వర్క్ షాప్ కి హాజరు అయ్యాడు..ఈ సందర్భంగా ఆయన తో పాటు ఫోటో దిగి ఆ చిత్ర సంగీత్ దర్శకుడు ఒక ఫోటో ని ట్విట్టర్ లో అప్లోడ్ చెయ్యగా..దానికి నిమిషాల వ్యవధి లోనే వేలకొద్దీ రీ ట్వీట్స్ మరియు లైక్స్ వచ్చాయి..కీరవాణి గారి ట్విట్టర్ హిస్టరీ లో ఇప్పటి వరుకు అలాంటి రీచ్ వచ్చిన ట్వీట్ లేదు.

ఈ ఫోటో లో పవన్ కళ్యాణ్ లుక్ ని చూసిన అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పొయ్యాయి..సన్నని గెడ్డం తో ఎరుపు టీ షర్ట్ తో దర్శనమిచ్చిన పవన్ కళ్యాణ్ ని చూసి అభిమానులు ఎంతో మురిసిపోయారు..ఈ లుక్ తో ఒక పూర్తి స్థాయి సినిమా పడితే చూడాలని ఉందంటూ కామెంట్స్ చేసారు..కానీ హరి హర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ వేరు కదా..ఇప్పుడు ఉన్న లుక్ కి హరి హర వీరమల్లు లుక్స్ కి అసలు ఇంత తేడా ఏంటి?..ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన ఫ్లాష్ బ్యాక్ లో ఇలా కనిపించబోతున్నాడా..ఇలా ఎన్నో సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి..అయితే అసలు విషయానికి వస్తే ఈ లుక్స్ హరి హర వీరమల్లు సినిమా కోసం కాదు..త్వరలోనే ఆయన సుజీత్ తో ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ చెయ్యబోతున్నాడు అని చాలా రోజుల నుండి ఒక టాక్ ఉంది..ఆ సినిమాకి సంబంధించిన టెస్ట్ లుక్ ని ఇటీవలే అమెరికా లో నిర్వహించారట..అందుకోసమే పవన్ కళ్యాణ్ ఈ లేటెస్ట్ స్టైలిష్ లుక్ కి మారాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..ఇదే కనుక నిజమైతే అభిమానులకు పండగే..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ రాబొయ్యే రోజుల్లో తెలుస్తుంది.
