Pawan Kalyan- Samantha: సమంత అనారోగ్యంతో బాధపడుతుండగా అభిమానులు చిత్ర ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమంత మాయోసైటిస్ బారినపడ్డానని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. చలించిపోయిన చిరంజీవి, ఎన్టీఆర్ వంటి స్టార్ట్స్ సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించారు. ఆమెలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. త్వరగా కోలుకుని పూర్వ స్థితికి చేరాలని ఆకాంక్షించారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమంత అనారోగ్యాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారట.మాటలు కాదు చేతల వ్యక్తిగా పేరున్న పవన్ కళ్యాణ్ సమంత ఆరోగ్యం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారట.

సమంతకు చికిత్స అందించేందుకు విదేశాల నుండి ఎక్స్ పర్ట్స్ ని పిలిపిస్తున్నారట. మయోసైటిస్ కి సంబంధించిన స్పెషలిస్ట్స్, కండరాల నిపుణులను ఇండియాకు రప్పిస్తున్నారట. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయట. సమంతకు ఏమీ కాకూడని కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారట. కోట్లు ఖర్చుపెట్టి సమంతకు ఖరీదైన వైద్యం అందించేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్న వార్త… టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇక పవన్ ఔదార్యం, ఎదుటివారి గురించి ఆలోచించే తత్త్వానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఏమైనా పవన్ కళ్యాణ్ ప్రత్యేకం అంటున్నారు.
మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. కాగా పవన్ కళ్యాణ్-సమంత కాంబినేషన్లో తెరకెక్కిన అత్తారింటికి దారేది అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఉంది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అత్తారింటికి దారేది మూవీలో సమంత-పవన్ కళ్యాణ్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది.

ప్రస్తుతం సమంత ఇంటి వద్దే ఉంటూ వైద్యం చేయించుకుంటున్నారు. అనారోగ్యం బారినపడ్డాక మొదటిసారి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రస్తుత హెల్త్ కండిషన్ గురించి మాట్లాడారు. పత్రికల్లో వచ్చినట్లు నేను ఏమీ చనిపోలేదు. అంత క్రిటికల్ కండీషన్ కాదు. అయితే ఇది ప్రమాదకరమైన వ్యాధే.ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి. దీన్ని ఎదిరించి కోలుకుంటాననే ధైర్యం ఉంది, అన్నారు. యశోద మూవీ డబ్బింగ్ పనులు అనారోగ్యంతో ఇబ్బందిపడుతూనే పూర్తి చేశారు. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా యశోద తెరకెక్కింది. నవంబర్ 11న వరల్డ్ వైడ్ 5 భాషల్లో విడుదల కానుంది.