Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాడ్స్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. తాను చేసే యాడ్ తన అభిమానుల పై బాగా ప్రభావం చూపిస్తోందని.. అందుకే, సరైన యాడ్స్ మాత్రమే తాను చేస్తాను అని పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెబుతూ ఉంటాడు. తన మాటలకు తగ్గట్టుగానే కమర్షియల్ బ్రాండింగ్స్ కి తొలి నుంచి పవన్ కళ్యాణ్ దూరంగానే ఉంటూ వస్తున్నాడు.

నిజానికి ఈ యాడ్స్ విషయంలో పవన్ కళ్యాణ్ కి కంపెనీ లు కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా పవన్ ఎన్నడూ ఆసక్తి చూపించలేదు. ఎలాంటి కమర్షియల్ ఉత్పత్తుల్ని ప్రమోట్ చేయడానికి ముందుకు రాని స్టార్ గా, పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ఇమేజ్ కూడా ఉంది. అయితే, పవన్ కళ్యాణ్ సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఓ యాడ్ లో నటించాడు. ఇప్పుడు ఆ యాడ్ హాట్ టాపిక్ అయ్యింది.
ఇంతకీ, అప్పట్లో పవన్ కళ్యాణ్ నటించిన ఆ యాడ్ ఏమిటో తెలుసా ?, పెప్సీ యాడ్. ఈ పెప్సీ యాడే పవన్ మొదటి యాడ్. అవును.. అదే పవన్ కళ్యాణ్ మొదటి యాడ్ మరియు చివరి యాడ్ కూడా. అందుకే కాబోలు.. ఈ యాడ్ కి ఇప్పుడు ఫుల్ క్రేజ్ వచ్చింది. పవన్ చేసిన ఒకే ఒక యాడ్ ఇదే అంటూ నెటిజన్లు ఈ యాడ్ ను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఫలితంగా ఈ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ యాడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఓ భారీ డీల్ కు కూడా నో చెప్పాడు. ప్రముఖ కంపెనీ పొగాకు ఉత్పత్తి అయిన ఇలాచీ పౌడర్ ను సపోర్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ ను సంప్రదించింది సదరు కంపెనీ. పైగా ఈ సంస్థ పవన్ కళ్యాణ్ కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసింది. అయితే ఈ యాడ్ ఫ్యాన్స్ ను తప్పుదోవ పట్టిస్తుందని భావించిన పవన్ కళ్యాణ్ ఈ యాడ్ లో నటించను అని తేల్చి చెప్పాడు.
ఇలా డబ్బులు వచ్చే యాడ్స్ ను వదిలే హీరోలు ఈ రోజుల్లో అసలు ఎవరైనా ఉన్నారా ?, ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. అందుకే, పవన్ కళ్యాణ్ ఎప్పుడూ స్పెషలే. పైగా ప్రజలకు హాని కలిగించే యాడ్స్ కు దూరంగా ఉండటం తన కర్తవ్యం అని పవన్ చెప్పాడట. పవన్ విధానం తమకు గర్వకారణం అని పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు. దటీజ్ పవన్ కళ్యాణ్.