OG sequel update: నేడు భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం అభిమానులకు బాగా నచ్చింది కానీ, మామూలు ఆడియన్స్ కి యావరేజ్ నుండి ఎబోవ్ యావరేజ్ అని అనిపించింది. A సెంటర్స్ లో అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి కానీ, B,C సెంటర్స్ లో పర్లేదు అనే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అర్బన్ గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా కాబట్టి, కచ్చితంగా ఇలా ఉంటుందని విశ్లేషకులు ముందుగానే ఊహించారు. వాళ్ళ ఊహలే నిజమయ్యాయి. అయితే ఈ సినిమాలో చాలా సన్నివేశాలు ఎందుకో పూర్తిగా కంప్లీట్ చేయలేదని అనిపించింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య అనుభందం అంత బలంగా ఏర్పడడానికి కారణం ఏమిటి?, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి హీరోయిన్ తో పరిచయం ఎలా అయ్యింది?, ఆయన బాల్యానికి సంబంధించిన పూర్తి విషయాలు వంటివి అలా చూపించినట్టే చూపించి కట్ చేసేసారు.
అయితే అవన్నీ రెండవ పార్ట్ కోసం దాచి పెట్టినట్టు తెలుస్తుంది. కచ్చితంగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోందని అంటున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అసలైన తండ్రి క్యారక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఆ క్యారక్టర్ ని రెండవ పార్ట్ కోసం దాచి పెట్టారట. క్లైమాక్స్ చివర్లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన జపాన్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు ఉంటాయి చూడండి, ఇదంతా రెండవ పార్ట్ లోనే చూపిస్తారట. ఇందులో పవన్ కళ్యాణ్ తండ్రి పేరు అకిరా అని తెలుస్తుంది. అదే విధంగా ఈ కథకు సుభాష్ చంద్రబోస్ కి ఉన్న లింక్ ఏంటి? అనేది కూడా రెండవ పార్ట్ లోనే చూపిస్తారట. ఇలా ఎన్నో డీటెయిల్స్ కి సమాధానం దొరకాలంటే రెండవ పార్ట్ వచ్చే వరకు ఎదురు చూడాలి. అయితే ఇలా సగం సగం చూపించడం వల్ల ఆడియన్స్ అనేక సన్నివేశాలు అర్థం కాలేదు అనేది వాస్తవం. ఇది B ,C సెంటర్ ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు. లాంగ్ రన్ లో దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి కాస్త మంచి థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.