Renu Desai Injured: పవన్ కళ్యాణ్ మాజీ భార్య గా రేణు దేశాయ్ కి సోషల్ మీడియా లో మంచి పాపులారిటీ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. బద్రి సినిమాతో పరిచయమైనా ఈ ఇద్దరు, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, కొన్నేళ్లు సహజీవనం చేసి పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ దంపతులిద్దరికీ అకీరానందన్ మరియు ఆద్య అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
కొన్ని విబేధాల కారణం గా 2012 వ సంవత్సరం లో విడిపోయారు పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్. అయితే పవన్ కళ్యాణ్ తో విడిపోయినప్పటికీ రేణు దేశాయ్ ని పవన్ అభిమానులు ఇప్పటికీ వదిన అని పిలుస్తూ అభిమానిస్తుంటారు. ఇక సోషల్ మీడియా లో తరచూ యాక్టీవ్ గా ఉండే రేణు దేశాయ్, తనకి సంబంధించిన ఫోటోలు మరియు తన పిల్లలకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది.
రీసెంట్ గా ఆమె తన కొడుకు అకిరా నందన్ జిమ్ వర్కౌట్ వీడియో ని ఇంస్టాగ్రామ్ లో స్టోరీ గా అప్లోడ్ చేసింది. దీనికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఆయన హీరో గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నాడు. రేణు దేశాయ్ కూడా చాలా కాలం తర్వాత రవితేజ హీరో గా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం తో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో ఆమె ఒక పవర్ ఫుల్ పాత్ర ని పోషించినట్టు సమాచారం.
అయితే షూటింగ్ లో ఆమెకి దెబ్బలు ఏమైనా తగిలాయో ఏమో తెలియదు కానీ, తన కాళ్లకు బాగా దెబ్బలు తగిలాయని, అందువల్ల కాలు వేళ్ళు బాగా దెబ్బతిన్నాయని, అందులో ఒకటి చితికిపోయిందని చెప్పుకొచ్చింది. ఆమె ఈ పోస్ట్ పెట్టినప్పటి నుండి సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేణు దేశాయ్ ని జాగ్రత్తగా ఉండమని కోరుకుంటున్నారు.