Homeఎంటర్టైన్మెంట్Ramesh Babu death: రమేష్ బాబు మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగం..!

Ramesh Babu death: రమేష్ బాబు మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగం..!

Ramesh Babu death: ప్రముఖ నిర్మాత, నటుడు రమేష్ బాబు మృతితో టాలీవుడ్లో విషాదచాయలు నెలకొన్నాయి. కాలేయ వ్యాధితో కొద్దిరోజులుగా బాధపడుతున్న రమేష్ బాబు నిన్న సాయంత్రం 10:30గంటలకు కన్నుమూశారు. దీంతో కృష్ణ ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు రమేష్ బాబు కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి రమేష్ బాబు అడుగుపెట్టారు. తొలినాళ్లలో స్టార్ హీరోగా గుర్తు తెచ్చుకున్న రమేష్ బాబు ఆ తర్వాత మాత్రం వెనుకబడ్డాడు. ఈక్రమంలోనే ఆయన నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. అయితే నిర్మాతగా నష్టాలు రావడంతో నిర్మాణరంగానికి దూరమయ్యారు.  తన సోదరుడు మహేష్ బాబు నటించిన ‘అర్జున్’ మూవీకి సైతం రమేష్ బాబునే ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

దాదాపు 40ఏళ్లపాటు ఆయన చిత్రసీమతో అనుబంధం ఉంది. ఆయనపై ఏనాడూ ఏ వివాదం నెలకొనలేదు. సౌమ్యుడిగా, వివాదారహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతోపాటు తమిళంలోనూ ఆయన పలు సినిమాల్లో నటించారు. సూపర్ స్టార్ కృష్ణ అండ రమేష్ బాబుకు ఉన్నప్పటికీ అతడు నటుడిగా, నిర్మాతగా మాత్రం పూర్తి స్థాయిలో రాణించకపోవడం నిజంగా శోచనీయమనే చెప్పాలి.

రమేష్ బాబు మృతిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావోద్యేగానికి గురయ్యారు. రమేష్ బాబు కృష్ణగారి నట వారసత్వాన్ని కొనసాగించి నిర్మాతగానూ పలు విజయాలు అందుకున్నారని పవన్ గుర్తు చేశారు. కృష్ణగారు ఇప్పుడు పుత్రశోకాన్ని దిగమింగుకోవాల్సిన క్లిష్ట సమయమిదని.. ఆయన కుటుంబానికి భగవంతుడు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని కోరకుంటున్నా అని ఒక సందేశంలో పేర్కొన్నారు.

Ramesh Babu Death

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version